Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ చ‌మురు మరియు గ్యాస్ రంగ నిపుణులు/సిఇఒ ల‌తో ప్రధాన మంత్రి భేటీ

ప్ర‌పంచ చ‌మురు మరియు గ్యాస్ రంగ నిపుణులు/సిఇఒ ల‌తో ప్రధాన మంత్రి భేటీ

ప్ర‌పంచ చ‌మురు మరియు గ్యాస్ రంగ నిపుణులు/సిఇఒ ల‌తో ప్రధాన మంత్రి భేటీ

ప్ర‌పంచ చ‌మురు మరియు గ్యాస్ రంగ నిపుణులు/సిఇఒ ల‌తో ప్రధాన మంత్రి భేటీ


భార‌త‌దేశానికి చెందిన, విదేశాల‌ కు చెందిన చ‌మురు మ‌రియు గ్యాస్ రంగం సిఇఒ లు, నిపుణుల‌ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున భేటీ అయ్యారు.

సభికుల లో సౌదీ అరేబియా మ‌రియు యుఎఇ ల మంత్రులు, ఇంకా సౌదీ అరమ్‌కో, అద్ నాక్, బిపి, ర‌స్‌నెఫ్ట్‌, ఐహెచ్ఎస్ మార్కిట్, పాయనియర్ నేచుర‌ల్ రిసోర్సెస్ కంపెనీ, ఎమ‌ర్స‌న్ ఎలెక్ట్రిక్ కంపెనీ, తేల్‌యూరియ‌న్‌, ముబాదలా ఇన్ వెస్ట్‌మెంట్ కంపెనీ, శ్లంబ‌ర్జ‌ర్ లిమిటెడ్, వుడ్ మెకంజీ, వ‌ర‌ల్డ్ బ్యాంక్, ఇంటర్ నేశనల్ ఎనర్జి ఏజెన్సీ (ఐఇఎ), ఎన్ఐపిఎఫ్‌పి, బ్రూకింగ్స్ ఇండియా లు సహా పలు సంస్థ ల సిఇఒ లు, నిపుణుల తో పాటు చ‌మురు, గ్యాస్ ల ఉత్ప‌త్తి, మార్కెటింగ్ కార్య‌క‌లాపాల లో ప్ర‌మేయం ఉన్న‌టువంటి వివిధ భార‌తీయ కంపెనీ లు కూడా ఉన్నాయి.

కేంద్ర మంత్రులు శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్ట‌ర్ రాజీవ్ కుమార్ మ‌రియు కేంద్ర ప్ర‌భుత్వం, నీతి ఆయోగ్ లకు చెందిన సీనియ‌ర్ అధికారులు కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌ కు పైగా వ్యాపార అనుకూల‌త‌, ఇంకా భార‌త‌దేశ శ‌క్తి రంగం లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల‌ ను ప్ర‌పంచ సిఇఒ లు మ‌రియు నిపుణులు మెచ్చుకొన్నారు. చ‌మురు నిక్షేపాల ఉత్ప‌త్తి రంగం లో పెట్టుబ‌డి కి సంబంధించి భార‌తదేశం యొక్క స్ప‌ర్ధాత్మ‌క స్థానం 56 నుంచి 44 కు ఎగ‌బాకిన ప‌రిణామాన్ని నిపుణులు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. భార‌త‌దేశం లో చ‌మురు మ‌రియు గ్యాస్ సంబంధిత మౌలిక స‌దుపాయాల విస్త‌ర‌ణ; అన్వేష‌ణ లోను, ఉత్ప‌త్తి లోను పెరుగుద‌ల‌; సౌర శ‌క్తి, ఇంకా బ‌యోఫ్యూయల్స్ ప‌రంగా అవకాశాలు; శ‌క్తి రంగం లో కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌గ్ర వైఖ‌రి వంటి విష‌యాలు చ‌ర్చ లో చోటు చేసుకొన్నాయి. విధాన ప‌ర‌మైన అంశాల లో సంబంధిత వ‌ర్గాలు అన్నింటినీ ఒక చోటు కు తెచ్చి ఈ విధ‌మైన చ‌ర్చ‌ కై విశిష్ట‌మైన కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు నిపుణులు ప్ర‌శంస‌లు కురిపించారు.

శ‌క్తి రంగం యొక్క ప్ర‌పంచ నాయ‌కుల తో ప్ర‌ధాన మంత్రి సంభాషిస్తూ, చ‌మురు మ‌రియు గ్యాస్ విప‌ణి లో భార‌త‌దేశానికి ఉన్న గ‌ణ‌నీయ స్థానాన్ని గురించి ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించారు. చ‌మురు విప‌ణి ఉత్ప‌త్తిదారు సంస్థ‌ల కు ప్రాధాన్యం ఉన్న విపణి అని ఆయ‌న పేర్కొంటూ, ఇందులో ప‌రిమాణాన్ని, ధ‌ర‌ల‌ ను చ‌మురు ఉత్ప‌త్తి దేశాలే నిర్ధారిస్తున్నాయ‌న్నారు. ఉత్ప‌త్తి త‌గినంత‌గా ఉన్న‌ప్ప‌టికీ కూడా చ‌మురు రంగం లో మార్కెటింగ్ తాలూకు విశిష్ట‌మైన అంశాలు చ‌మురు ధ‌ర‌ ల‌ను ఎగ‌దోశాయ‌ని చెప్పారు. ఇత‌ర విప‌ణు ల‌లో ఉన్న విధం గానే చ‌మురు విప‌ణి లోనూ ఉత్ప‌త్తిదారు ల‌కు మ‌రియు వినియోగ‌దారు ల‌కు మ‌ధ్య ఒక భాగ‌స్వామ్యం త‌ప్ప‌క నెల‌కొనాల‌ని ప్ర‌ధాన మంత్రి అభిప్రాయపడ్డారు. ఇది జ‌రిగితే, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ నిల‌దొక్కుకొనేందుకు అండ ల‌భించగ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశానికి సంబంధించిన కొన్ని కీల‌క‌మైన విధాన సంబంధిత అంశాల ను నిపుణుల దృష్టి కి శ్రీ మోదీ తీసుకువ‌చ్చారు. పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణం గా చ‌మురు వినియోగదారు దేశాలు అనేక అన్య ఆర్థిక స‌వాళ్ళ‌ ను ఎదుర్కొంటున్నాయని, వాటి లో నిధుల కొర‌త ఒక‌ సవాలు గా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ అంత‌రాన్ని భ‌ర్తీ చేయ‌డం లో చ‌మురు ఉత్ప‌త్తి దేశాల స‌హ‌కారం ఎంతో కీల‌కం కాగలదని ఆయన అన్నారు. చ‌మురు ను ఉత్ప‌త్తి చేస్తున్న దేశాలు వాటి వ‌ద్ద పెట్టుబ‌డి కి వీలుగా ఉన్న మిగులు సొమ్ము ను అభివృద్ధి చెందుతున్న దేశాల లో చ‌మురు రంగం లో వాణిజ్య‌ స‌ర‌ళి అన్వేష‌ణ కార్య‌క‌లాపాల‌ కు వెచ్చించడాన్ని గురించి ప‌రిశీలించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే సాంకేతిక‌త, ఇంకా క‌వ‌రేజి యొక్క విస్త‌ర‌ణ.. ఈ అంశాలు రెంటి లోను అభివృద్ధి చెందిన దేశాలు అన్వేష‌ణ ప‌రంగా, స‌హ‌కారం ప‌రంగా ఇతోధికం గా తోడ్ప‌డాల‌ని ఆయ‌న సూచించారు. గ్యాస్ రంగం లో పంపిణీ ప్ర‌క్రియ లో ప్రైవేటు ప్రాతినిధ్యం మ‌రింత పెర‌గాల‌ని ఆయ‌న కోరారు. సాంకేతిక విజ్ఞానాన్ని గురించి ఆయ‌న చెప్తూ, స‌హ‌జ‌ వాయువు ను వాణిజ్య స‌ర‌ళి లో వినియోగానికి సిద్ధం చేసేందుకు అధిక పీడ‌నానికి మ‌రియు అధిక ఉష్ణోగ్రత కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకోవడం లో స‌హ‌కారాన్ని అందించాలంటూ మ‌న‌వి చేశారు. ఆఖరుగా, చెల్లింపు అంశాల లో స‌మీక్ష అవ‌స‌ర‌మ‌ని, త‌ద్వారా స్థానిక క‌రెన్సీ కి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌వ‌చ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్య‌క్తం చేశారు.

ఈ రంగం లో త‌న ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి ప‌థ‌కాల‌ ను మ‌రియు విధాన ప‌ర‌మైన‌టు వంటి వివిధ కార్య‌క్ర‌మాల‌ ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. గ్యాస్ ధ‌ర‌ల నిర్ణ‌య విధానం మ‌రియు మార్కెటింగ్.. స‌ముద్ర అంత‌ర్భాగం లో, ఇంకా అధిక పీడ‌నం మధ్య, అధిక ఉష్ణోగ్ర‌త ల మ‌ధ్య కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ కు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త ల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఓపెన్ ఎక‌రేజి లైసెన్సింగ్ పాలిసి, కోల్ బెడ్ మీథేన్ ను త్వ‌రితంగా సొమ్ము చేసుకోవ‌డం, చిన్న నిక్షేపాల ను క‌నుగొనేందుకు ప్రోత్సాహ‌కాల ప్ర‌క‌ట‌న‌ మ‌రియు జాతీయ స్థాయి లో భూకంప సంబంధ స‌ర్వేక్ష‌ణ‌ ను గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్ర‌స్తుతం అమ‌లు లో ఉన్న వాణిజ్య స‌ర‌ళి ఉత్ప‌త్తి ని గురించి వివ‌రిస్తూ ఉత్ప‌త్తి పంప‌కం కాంట్రాక్టు ల‌ను విస్త‌రించుకోవాలని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.