Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ నేత‌ల నుండి ప్ర‌ధాన మంత్రి కి అందుతున్న అభినందన సందేశాలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న కూడా ప్ర‌పంచ‌వ్యాప్తం గా నేతల వద్ద నుండి వ‌స్తున్న అభినంద‌న పూర్వ‌క సందేశాల ను అందుకొన్నారు. వీటిలో శ్రీ‌ లంక అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మైత్రీపాల సిరీసేన, సౌదీ అరేబియా రాజు, శ్రేష్ఠుడు సల్ మాన్ బిన్ అబ్దులజీజ్‌ అల్- సౌద్, యునైటెడ్ స్టేట్స్ అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ ల‌తో పాటు, నేపాల్ పూర్వ ప్రధాని, శ్రేష్ఠుడు శ్రీ పుష్ప కమల్ ద‌హాల్ ‘ప్రచండ’ నుండి వ‌చ్చిన టెలిఫోన్ కాల్స్ ఉన్నాయి.

అధ్య‌క్షుడు శ్రీ సిరిసేన ప్ర‌ధాన మంత్రి కి ఆత్మీయ అభినంద‌న‌ లు ప‌లుకుతూ, ఇరుగు పొరుగు దేశాల మ‌ధ్య సంబంధాలు పెంపొంద‌డాన్ని గురించి గుర్తు కు తెచ్చారు. ఉభ‌య దేశాల మ‌ధ్య ఉన్న ఈ సంబంధాల ను మ‌రింత గాఢ‌త‌రం చేసుకోవాల‌ని ఉంద‌న్న తన అభిలాష ను ఆయ‌న వ్య‌క్తం చేశారు. శ్రీ ల‌ంక అధ్య‌క్షుని కి ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు ప‌లికారు. అలాగే, ఈ ప్రాంతం కోసం మరియు ఇరు దేశాల ప్ర‌జ‌ల హితం కోసం మ‌రింత స‌న్నిహితం గా కృషి చేసేందుకు స‌న్న‌ద్ధం గా ఉన్న‌ానని ఆయ‌న వెల్ల‌డించారు.

భార‌త‌దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ నాయ‌క‌త్వం లో పురోగ‌మించాల‌ని మరియు వారు స‌మృద్ధి చెందాల‌ంటూ శుభాకాంక్ష‌లు తెలిపిన సౌదీ అరేబియా రాజు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ధ‌న్య‌వాదాలు పలికారు. భార‌త‌దేశం మ‌రియు సౌదీ అరేబియా ల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగమనం లో మాన్య రాజు గారు నెఱపుతున్న మార్గ‌ద‌ర్శ‌క‌త్వానికి గాను ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి తన ప్ర‌శంస‌లను అంద‌జేశారు.

అపూర్వ‌మైనటువంటి ఎన్నిక‌ల విజ‌యాన్ని సాధించినందుకు ప్ర‌ధాన మంత్రి కి అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ అభినంద‌న‌ లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల ను మ‌రియు ప్ర‌పంచ వ్య‌వ‌హారాల‌ ను చ‌ర్చించ‌డం కోసం జ‌పాన్ లోని ఒసాకా లో త్వ‌ర‌లో జ‌రిగే జి-20 శిఖ‌ర స‌మ్మేళ‌నం లో భేటీ అవ్వాల‌ని నేత‌లు ఇరువురూ అంగీక‌రించారు. ఉభయ దేశాల మ‌ధ్య స‌న్నిహిత‌మైనటువంటి మ‌రియు వ్యూహాత్మ‌క‌మైనటువంటి భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌ గా పెంపొందించుకోవ‌డం కోసం క‌ల‌సి కృషి చేయాల‌ని కూడా వారు అంగీకారాని కి వ‌చ్చారు.

**