Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డం కోసం ప‌రాగ్వే కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి


ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డం కోసం ప‌రాగ్వే కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య అవగాహనపూర్వక ఒప్పందాని కి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న స‌మావేశ‌మైన మంత్రి మండ‌లి ఆమోదాన్ని తెలిపింది. ఈ ఎంఒయు పై 2019వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 27వ తేదీ న న్యూ ఢిల్లీ లో సంత‌కాలు జ‌రిగాయి.

ఎంఒయు యొక్క ముఖ్యోద్దేశ్యాలు మ‌రియు ప్ర‌ధాన అంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:

ఎ) ప‌ర్య‌ట‌న రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని విస్త‌రించుకోవ‌డం;

బి) ప‌ర్య‌ట‌న రంగాని కి సంబంధించిన స‌మాచారాన్ని మ‌రియు డేటా ను ఒక ప‌క్షాని కి మ‌రొక ప‌క్షం ఇచ్చి పుచ్చుకోవ‌డం;

సి) హోట‌ళ్ళు మ‌రియు టూర్ ఆప‌రేట‌ర్లు, ఇంకా విమాన కంపెనీ లు స‌హా ప‌ర్య‌ట‌న రంగం తో సంబంధం క‌లిగిన వ‌ర్గాలన్నిటి మ‌ధ్య స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం;

డి) మాన‌వ వ‌న‌రుల వికాసం లో స‌హ‌క‌రించుకోవ‌డం కోసం ఆదాన ప్రదాన కార్య‌క్ర‌మాల ను రూపొందించడం;

ఇ) ప‌ర్య‌ట‌న మ‌రియు ఆతిథ్య రంగాల లో పెట్టుబ‌డులు;

ఎఫ్) ఉభ‌య దేశాల ప‌ర్య‌ట‌న రంగం ప్రోత్సాహానికై టూర్ ఆప‌రేట‌ర్ల‌ు/ప్ర‌సార మాధ్య‌మాలు/ప్రముఖ వ్యక్తుల యాత్రల ను ప‌ర‌స్ప‌రం నిర్వ‌హించ‌డం;

జి) ప్రోత్సాహం, మార్కెటింగ్ గమ్యాలు, అభివృద్ధి మరియు నిర్వహణ రంగాల లో అనుభవాన్ని ఒక పక్షం తో మరొక పక్షం పంచుకోవడం;

హెచ్) ఒక దేశం లో జరిగే యాత్రా మేళా లు/ ప్ర‌ద‌ర్శ‌న‌ల లో మరొక దేశం పాలు పంచుకోవడం; ఇంకా

ఐ) సుర‌క్షిత‌మైన, గౌర‌వ‌నీయ‌మైన మ‌రియు ప‌ర్య‌ట‌న అవ‌కాశాల ను ఎక్కువ సంఖ్య లో క‌ల్పించ‌డం.

లాభాలు:

ప‌రాగ్వే కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఎంఒయు కుదరడం ప‌ర్య‌ట‌న రంగం లో ఈ రెండు దేశాలు స‌హ‌కారాన్ని పెంపొందించుకోవ‌డాని కి ఒక సంస్థాగ‌త‌మైన‌టువంటి యంత్రాంగాన్ని నెల‌కొల్ప‌డం లో స‌హ‌య‌కారి గా ఉంటుంది. ఇది ప‌రాగ్వే నుండి విదేశీ యాత్రికుల ఆగ‌మ‌నాన్ని అధికం చేసుకోవ‌డం లో భార‌త‌దేశాని కి మ‌రింత గా తోడ్ప‌ాటును అందిస్తుంది. త‌ద్వారా, ఆర్థికాభివృద్ధి మ‌రియు ఉద్యోగ క‌ల్ప‌న మెరుగవుతాయి. స్థూల స‌హ‌కారాని కి ఉద్దేశించిన రంగాల లో సంబంధిత ప‌క్షాలు అన్నిటి కి ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు అందేట‌ట్లుగా ప‌ర్య‌ట‌న రంగంలో దీర్ఘ కాల స‌హ‌కారాని కి అనుకూల‌మైన‌ స్థితిగ‌తుల ను ఈ ఎంఒయు ఏర్ప‌రుస్తుంది. ఈ ఎంఒయు లో నిర్దేశించిన ల‌క్ష్యాల ను సాధించుకొనే విధం గా సర్వోత్త‌మ‌ అభ్యాసాల ను రూపొందించి, వాటి ని ఆచ‌ర‌ణ లోకి తీసుకు వచ్చే ఆలోచనలు చేయడం జరుగుతుంది.

***