Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ర‌మ పూజ‌నీయులు డాక్ట‌ర్ ఫిలిపోస్మార్ క్రిసోస్తోమ్ మార్ తోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్ర‌ధాన మంత్రి


ప‌ర‌మ పూజ‌నీయులు డాక్ట‌ర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్తోమ్ మార్ తోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘ప‌ర‌మ పూజనీయులు డాక్ట‌ర్ ఫిలిపోస్ మార్ క్రిసోస్తోమ్ మార్ తోమా వ‌లియా మెట్రోపాలిట‌న్ క‌న్నుమూశార‌ని తెలిసి దుఃఖానికి లోన‌య్యాను. ఆయ‌న ను ఆయనకు గల ఘ‌న‌మైన ఆధ్యాత్మిక జ్ఞానం తో పాటు మాన‌వుల ఇక్క‌ట్టుల ను దూరం చేయ‌డానికి ఆయన ప‌డిన అశేష ప్ర‌యాస‌ల కు గాను స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది. మాలంక‌ర మార్ తోమా సిరియ‌న్ చ‌ర్చి స‌భ్యుల కు ఇదే నా సంతాపం’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***