Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిట్‌నెస్ వీడియో ను శేర్ చేసిన ప్ర‌ధాన మంత్రి; ఫిట్‌నెస్ చాలెంజ్ ను స్వీకరించడం కోసం ఐపిఎస్ అధికారులను నామినేట్ చేశారు


శ్రీ విరాట్ కోహ్లీ నుండి ఫిట్‌నెస్ చాలెంజ్ ను స్వీక‌రించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న యొక్క ఫిట్‌నెస్ వీడియో ను ఈ రోజు శేర్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి ‘‘నా ఉద‌యం పూట వ్యాయామం లోని కొన్ని దృశ్యాలు ఇవిగో. యోగాభ్య‌ాసం చేయడంతో పాటు, నేను ప్ర‌కృతి లోని పంచ‌త‌త్త్వాలు లేదా పంచభూతాలు అయిన‌టువంటి – పృథ్వి, జ‌లం, అగ్ని, వాయువు, ఇంకా ఆకాశం- వీటి నుండి ప్రేర‌ణ‌ ను పొంది రూపొందించిన ఒక బాట మీద న‌డుస్తాను. ఇది అలసట తీర్చేదిగా ఉండడమే కాకుండా కొత్త బల‌న్ని కూడా ఇస్తోంది. శ్వాస ను పీల్చ‌డానికి సంబంధించిన సాధనను కూడా నేను అభ్యసిస్తుంటా. #HumFitTohIndiaFit

స్వస్థత ను పెంపొందింపచేసుకొనే దిశ‌గా రోజు లో ఎంతో కొంత భాగాన్ని వెచ్చించవలసిందంటూ భారతదేశం లోని ప్ర‌తి ఒక్కరికీ నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

మీకు సౌక‌ర్య‌వంతంగా అనిపించేటటువంటి ఏవైనా కొన్ని అభ్యాసాల‌ను చేస్తూ ఉండండి. మ‌రి అది మీ జీవ‌నం లో తీసుకువచ్చే స‌కారాత్మ‌క‌మైన వ్య‌త్యాసాన్ని మీరు గ‌మ‌నించి తీరుతారు! #FitnessChallenge #HumFitTohIndiaFit”

ఫిట్‌నెస్ చాలెంజ్ యొక్క వేగాన్ని ప్ర‌ధాన మంత్రి పెంచుతూ, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ హెచ్‌.డి. కుమార‌స్వామి ని, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా ను మ‌రియు దేశవ్యాప్త ఐపిఎస్ అధికారులను.. ప్ర‌త్యేకించి 40 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారిని.. ఫిటెనెస్ ఛాలెంజ్ ను స్వీక‌రించ‌వలసిందంటూ నామినేట్ చేశారు.

“ఈ కింద పేర్కొన్న‌ వారిని #FitnessChallenge స్వీకరించవలసిందిగా నామినేట్ చేయ‌డానికి నేను సంతోషిస్తున్నాను:

క‌ర్నాట‌క యొక్క ముఖ్య‌మంత్రి శ్రీ హెచ్‌.డి. కుమార‌స్వామి

2018 సంవ‌త్స‌రం కామన్ వెల్త్ గేమ్స్ లో భార‌త‌దేశానికి అత్య‌ధిక ప‌త‌కాలను గెలుచుకొని భారతదేశానికి గర్వకారకులుగా ఉన్నటువంటి వారిలో నుండి మనికా బాత్రా

ధైర్య‌వంతులైన ఐపిఎస్ అధికారుల‌ందరూ, ప్ర‌త్యేకించి 40 ఏళ్ల వయస్సు మించినటువంటి వారు దీనిలో పాలుపంచుకోవాలి” అని త‌న సందేశంలో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***