Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల‌కు వార్ధక్య లాభాలలో భాగంగా పెన్షన్ తో పాటు పోస్ట్-రిటైర్ మెంట్ మెడికల్ స్కీమ్స్ ను ప్ర‌వేశ‌పెట్టే ప్రతిపాదనకు మంత్రిమండ‌లి ఆమోదం


డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డి పి ఇ) మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా భార‌త ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) ఉద్యోగుల‌కు ఉద్యోగ విర‌మ‌ణ ల‌బ్ధికింద పెన్ష‌న్‌తో పాటు పోస్ట్- రిటైర్ మెంట్ మెడికల్ స్కీమ్ ను ప్ర‌వేశ‌పెట్టే ప్రతిపాదనకు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం తన ఆమోదాన్ని తెలిపింది.

ఈ రెండు ప‌థ‌కాల అమ‌లుకు ప్ర‌భుత్వంపై పడే వార్షిక ఆర్థిక భారం.. ఉద్యోగుల ప్ర‌స్తుత జీతాల స్థాయి ప్ర‌కారం.. 134.4 కోట్ల రూపాయ‌ల‌ దాకా ఉంటుంది.

ఎఫ్‌ సి ఐ ఉద్యోగుల‌కు కొత్త పెన్ష‌న్ ప‌థ‌కం ముఖ్యాంశాలు :

1. వర్తింపు – ఉద్యోగులు అందరికీ. భార‌త ఆహార సంస్థ‌లో 1.12.2008 నాటికి వేత‌న‌దారుల ప‌ట్టిక‌లో ఉన్న ఉద్యోగులు (I, II, III మరియు IV కేటగిరీల వారు) అందరితో పాటు ఆ తేదీ తరువాత నియామకం జరిగిన వారికి కూడా ఈ పథకం వ‌ర్తిస్తుంది.

2. అర్హ‌త – మ‌ర‌ణం సంభ‌వించిన సంద‌ర్భాలు మిన‌హా, ఉద్యోగ విర‌మ‌ణ‌ కన్నా ముందు క‌నీసం 15 సంవ‌త్స‌రాల సర్వీస్ పిరియడ్ కలిగి ఉండాలి.

3. అమలు వ‌ర్తించే తేదీ – 01.12.2008. (వేత‌న స‌వ‌ర‌ణ అల‌వెన్సులు వ‌ర్తించే తేదీకి అనుగుణంగా)

4. యాజ‌మాన్యం చందా – 01.12.2008 నాటికి ప‌నిచేస్తున్న ఉద్యోగుల విషయంలో గాని, లేదా ఆ త‌రువాత నియ‌మితులైన ఉద్యోగుల విషయంలో గాని మూల‌ వేత‌నం మరియు డి ఎ లో నెల‌కు 10 శాతం వంతున.

5. ఉద్యోగులు తప్పనిసరిగా చెల్లించవలసిన చందా – మూల వేతనం + డి ఎ లో నెలకు 2 శాతం వంతున.
ఉద్యోగుల స్వ‌చ్ఛంద చందా – మూల‌ వేత‌నం + డి ఎ లో నెలకు 25 శాతం వరకు.

6. లాభాలు – ఉద్యోగ విర‌మ‌ణ త‌రువాత పింఛ‌ను (యాన్యుఇటీ) మరియు డెత్ కవర్.

ఎఫ్‌సిఐ ఉద్యోగుల‌కు ఉద్యోగ విర‌మ‌ణానంత‌ర నూతన వైద్య ప‌థ‌కం ముఖ్యాంశాలు:

1. వ‌ర్తింపు – భార‌త ఆహార సంస్థ‌లో ప‌నిచేస్తున్న I, II, III మరియు IV కేటగిరీల ఉద్యోగులు అందరికీ, ఇంకా విశ్రాంత ఉద్యోగుల‌కు కూడా ఈ పథకం వర్తిస్తుంది; అయితే, విశ్రాంత ఉద్యోగులు ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న‌ ‘కరెంట్ ఎంప్లాయీ ఫండెడ్ మెడికల్ హెల్త్ స్కీమ్ ఫర్ రిటైరీస్’ స‌భ్యులు అయి ఉండాలి.

2. అర్హ‌త – మ‌ర‌ణం సంభ‌వించిన సంద‌ర్భాలు మిన‌హా, ఉద్యోగ విర‌మ‌ణ‌ కన్నా ముందు క‌నీసం 15 సంవ‌త్స‌రాల సర్వీస్ పిరియడ్ కలిగి ఉండాలి.

3. యాజ‌మాన్యం చందా – 01.04.2016 నుండి వ‌ర్తించే విధంగా మూల‌ వేత‌నం+ డి ఎ లో నెల‌కు 3.83 శాతం.

4. ఉద్యోగి చందా – ఉద్యోగ విర‌మ‌ణ కాలంలో కడపటి సారి అందుకున్న మూల వేతనం మరియు డి ఎ / సర్వీసు లో ఉంటూ మరణించిన సమయానికి (దాంపత్య భాగస్వామి విషయంలో), ఇది క‌నీసం 10,000 రూపాయ‌లుగా ఉండాలి.

5. క‌వ‌రేజి – ఉద్యోగ విర‌మ‌ణ చేసిన మెంబరు, అత‌ని/ఆమె దాంపత్య భాగ‌స్వామి, మరియు డిపెండెంట్ డిసేబుల్ డ్ చైల్డ్ లకు భారతదేశంలోని ఏ ఆసుపత్రిలోనైనాఅయ్యే వైద్య‌ సేవ‌ల ఖర్చులను .. మొత్తంమీద వార్షిక గరిష్ఠ ప‌రిమితికి మించ‌కుండా.. ఈ పథకం ఇముడ్చుకొంటుంది.

పూర్వ రంగం :

భార‌త ఆహార సంస్థ‌ల చ‌ట్టం,1964 లో భాగంగా ఎఫ్ సి ఐ ని 1965 లో స్థాపించారు. ఆహార ధాన్యాలు, ఇత‌ర ఆహార వ‌స్తువుల సేక‌ర‌ణ‌, నిల్వ‌, పంపిణీ మరియు అమ్మకం ఈ సంస్థ స్థాప‌న‌ లోని ముఖ్యోద్దేశాలు. దేశంలో ఆహార భ‌ద్ర‌త‌ ధ్యేయాన్ని నెరవేర్చడంలో ఈ సంస్థ ఇన్నేళ్లుగా కీల‌కమైన పాత్రను పోషిస్తూ వ‌చ్చింది. ఈ సంస్థ‌కు ఉన్న వ్యూహాత్మ‌కమైన ప్రాముఖ్యాన్ని, కార్యకలాపాల ప‌రిమాణాన్ని, తదిత‌ర ప‌రామితులను దృష్టిలో ఉంచుకొని ఎఫ్ సి ఐ ని షెడ్యూల్ ‘ఎ’ కు చెందిన కేంద్ర ప్ర‌భుత్వరంగ సంస్థలు (సి పి ఎస్ ఇ లు)గా గుర్తించారు.