Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ లోని నీస్ లో జరిగిన భయంకర దాడిని ఖండించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లోని నీస్ లో జరిగిన భయంకర దాడిని తీవ్రంగా ఖండించారు.

“నీస్ లో జరిగిన భయంకర దాడి నన్ను వ్యాకులపరచింది. ఇటువంటి మతి లేని హింసాత్మక చేష్టలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల శోకంలో నేను కూడా పాలు పంచుకొంటున్నాను.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మా ఫ్రెంచ్ సోదర సోదరీమణులకు ఎదురైన ఈ మహా దు:ఖ ఘడియలో వారి వేదనను భారతదేశం పంచుకొంటున్నది. వారికి బాసటగా నిలుస్తున్నది,” అని ప్రధాన మంత్రి అన్నారు.

***