పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
‘‘సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్।
సమానం మంత్రమభి మంత్రయే వః సమానేన వో హవిషా జుహోమి॥’’
మన సంకల్పాలు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మనం చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. భారతవర్షం (భారతదేశం) ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం ఇలాంటి ఐక్యతా భావంతోనే ముందుకు సాగాలని ఈ సుభాషితం తెలుపుతుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘మన సంకల్పాలు, ఆలోచనలు, మనసులోని భావోద్వేగాలన్నీ ఒక్కటైనప్పుడు మనం చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. మనమందరం ఐక్యతతో ముందుకు సాగుదాం. కలిసికట్టుగా దేశపు ప్రతి లక్ష్యాన్ని సాధిద్దాం’’ .
‘‘సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషామ్।
సమానం మంత్రమభి మంత్రయే వః సమానేన వో హవిషా జుహోమి॥’’
जब हमारे संकल्प, विचार और मन की भावनाएं एक होती हैं, तब हर कार्य सफल होता है। आइए, एकजुटता के साथ आगे बढ़ें और मिलकर भारतवर्ष के हर लक्ष्य को हासिल करें।
— Narendra Modi (@narendramodi) June 30, 2026
समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम्।
समानं मन्त्रमभि मन्त्रये वः समानेन वो हविषा जुहोमि॥ pic.twitter.com/gR3JZ8ws4J