పిఎంఇండియా
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, వారసత్వంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను వివరిస్తూ ఒక వ్యాసాన్ని రాశారు. అందులో డాక్టర్ ముఖర్జీ ఒక విద్యావేత్తగా, ఉప కులపతిగా, మంత్రిగా, రాజకీయ నేతగా దేశ ప్రజలకు అందించిన బహుముఖ సేవలను ప్రధాని ప్రస్తావించారు. భారత్ ఏకత, జాతీయ సమైక్యతను పటిష్ఠపరిచే దిశగా డాక్టర్ ముఖర్జీ సాటి లేని ప్రయత్నాలు చేశారని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రాజ్యాంగ 370, 35(ఏ) అధికరణాలను 2019లో రద్దు చేయడం… దేశ ఏకత, సమగ్రతల పరిరక్షణకు డాక్టర్ ముఖర్జీ జీవిత పర్యంతం కనబరిచిన అంకిత భావానికి సముచిత నివాళిగా నిలుస్తోందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితంపై ఒక వ్యాసాన్ని రాశాను. ఆ వ్యాసంలో ఉప కులపతి, మంత్రి, రాజకీయ నేత, తదితర హోదాల్లో డాక్టర్ ముఖర్జీ సాధించిన విజయాలను వివరించాను. భారత్ ఏకతను పెంపొందించడంలో ఆయన చేసిన సాటి లేని ప్రయత్నాలను ప్రధానంగా ప్రస్తావించాను. రాజ్యాంగ 370, 35 (ఏ) అధికరణాలను 2019లో రద్దు చేయడం ఆయన ప్రయత్నాలకు ఒక సముచిత నివాళిగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఇవాళ దేశం… అఖండ భారత్ గురించి తపించిన, ప్రముఖ జాతీయవాది, గొప్ప విద్యావేత్త డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పాటిస్తోంది. శక్తిమంతమైన, స్వయంసమృద్ధ భారత్‌ను ఆవిష్కరించాలన్న ఆయన దార్శనికత దేశ నిర్మాణంలో మన సంకల్పానికి సరికొత్త శక్తిని అందిస్తుంది. ఈ సందర్భంగా ఆయన అమూల్య సేవలకు నా ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
***
Penned an Op-Ed on Dr. Syama Prasad Mookerjee's life, emphasising his diverse accomplishments, be it Vice Chancellor, Minister, political leader and more. Highlighted his unparalleled efforts in boosting India's unity. The removal of Articles 370 and 35(A) in 2019 remains a…
— Narendra Modi (@narendramodi) July 6, 2026
आज देश अखंड भारत के प्रणेता, प्रखर राष्ट्रवादी एवं महान शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की 125वीं जन्म-जयंती मना रहा है। सशक्त और आत्मनिर्भर भारत का उनका विजन राष्ट्र निर्माण के हमारे संकल्प को नई ऊर्जा दे रहा है। इस अवसर पर उनके अमूल्य योगदान को समर्पित मेरा यह आलेख……
— Narendra Modi (@narendramodi) July 6, 2026