Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రెంచ్ రిప‌బ్లిక్ అధ్య‌క్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రాన్ తో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


 

నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకొని ఫ్రెంచ్ రిప‌బ్లిక్ అధ్య‌క్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రాన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.  

ప్ర‌ధాన మంత్రి భార‌త‌దేశ ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌, ఇంకా స్వ‌యం గా త‌న త‌ర‌ఫున అధ్య‌క్షుడు శ్రీ మేక్రాన్ కునూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల ను మ‌రియు అభినంద‌న‌ల‌ ను వ్య‌క్తం చేశారు.

చాంట్ లీ లో, బియారిత్జ్ లో అధ్య‌క్షుడు శ్రీ మేక్రాన్ తో తాను ఇదివ‌ర‌కు జ‌రిపిన స‌మావేశాల ను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు.  ఫ్రాన్స్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత గా ప‌టిష్ట ప‌ర‌చుకోవాలని వుందన్న త‌న వ‌చ‌న బ‌ద్ధ‌త ను ఆయ‌న పున‌రుద్ఘాటించారు.  ఉభ‌య దేశాల మ‌ధ్య బ‌హుముఖీన సంబంధాల లో స్థిర పురోగ‌తి న‌మోద‌వుతున్నందుకు ఆయ‌న త‌న సంతృప్తి ని వెలిబుచ్చారు.

నేత‌లు ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల తో పాటు ప్రాంతీయ స్థితిగతుల లో, ప్రపంచ స్థితిగతుల లో ప‌ర‌స్ప‌ర హితం తో ముడిప‌డివున్నటువంటి విభిన్న అంశాల పట్ల తమ తమ అభిప్రాయాల ను ఒక‌రి తో మ‌రొక‌రు వెల్ల‌డించుకొన్నారు.

దేశాల మధ్య ర‌క్ష‌ణ‌, ప‌ర‌మాణు శ‌క్తి ని పౌర ప్ర‌యోజ‌నాల కు వినియోగించ‌డం తో పాటు స‌ముద్ర సంబంధిత భ‌ద్ర‌త వంటి రంగాల తో స‌హా అన్ని రంగాల లోను వ్యూహాత్మ‌క స‌హ‌కారాన్ని పెంపొందింప చేసుకోవ‌డం కోసం మరియు మరింత గా విస్తృత పరచుకోవడం కోసం ఒకరి తో మరొకరు సంబంధాల ను కొనసాగించాలి అంటూ కూడా వారు తమ యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.