పిఎంఇండియా
మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.
ఈ సంవత్సరం (2026) ప్రత్యేక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ… భారత్ ప్రస్తుతం ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ వందేమాతరం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి, యావత్ దేశానికి ఒక శాశ్వతమైన, అత్యంత శక్తిమంతమైన స్ఫూర్తిని బహుమతిగా ఇచ్చారని ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
మహోన్నత సాహితీవేత్త బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.
సాహిత్య దిగ్గజంగా నిలిచిన ఆయన రచనలు, తరతరాల భారతీయుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వభావనను రగిలించాయి. ఆయన అందించిన గొప్ప సాహిత్య సంపద ప్రజల ఆలోచనలకు వెలుగునిస్తూనే ఉంది. దేశ నిర్మాణ దిశగా మన సామూహిక సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంది.
మనం ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశేష సమయం ఇది. వందేమాతరం ద్వారా ఆయన మన స్వాతంత్య్ర ఉద్యమానికి, యావత్ దేశానికి ఎన్నటికీ చెరిగిపోని ఒక గొప్ప స్ఫూర్తిని బహుమతిగా ఇచ్చారు’’ .
***
Tributes to the great Bankim Chandra Chattopadhyay on his Jayanti.
— Narendra Modi (@narendramodi) June 26, 2026
A towering literary luminary, his writings awakened a spirit of patriotism and cultural pride among generations of Indians. His rich literary work continues to illuminate minds and strengthen our collective…
মহান বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়ের জয়ন্তীতে তাঁর প্রতি শ্রদ্ধাঞ্জলি।
— Narendra Modi (@narendramodi) June 26, 2026
এক সুবিশাল সাহিত্যিক আলোকবর্তিকা হিসেবে, তাঁর লেখা প্রজন্মান্তরের ভারতীয়দের মধ্যে দেশপ্রেম এবং সাংস্কৃতিক গৌরবের চেতনা জাগ্রত করেছিল। তাঁর সমৃদ্ধ সাহিত্যকর্ম মনকে উদ্ভাসিত করে চলেছে এবং জাতি গঠনের প্রতি…