Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బంగ్లాదేశ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్‌పి’ విజయంపై శ్రీ తారిఖ్‌ రెహమాన్‌కు ప్రధానమంత్రి అభినందన


బంగ్లాదేశ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్‌పి’ని అఖండ విజయం వైపు నడిపించారంటూ ఆ పార్టీ నాయకుడు శ్రీ తారిఖ్‌ రెహమాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు సదా భారత్‌ మద్దతు కొనసాగుతుందని శ్రీ మోదీ అన్నారు. “మన బహుముఖ సంబంధాల బలోపేతం, ఉమ్మడి ప్రగతి లక్ష్యాల సాధనలో మీతో సంయుక్తంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“బంగ్లాదేశ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ‘బిఎన్‌పి’ నిర్ణయాత్మక విజయానికి సారథ్యం వహించిన శ్రీ తారిఖ్‌  రెహమాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంపై దేశ నమ్మకానికి ఈ విజయమే నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారత్‌ సదా మద్దతుగా నిలుస్తుంది. మన బహుముఖ సంబంధాల బలోపేతానికి, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల సాధనకు మీతో సంయుక్తంగా కృషి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***