Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బల్గేరియా పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ రూమెన్ రాదేవ్‌కు ప్రధానమంత్రి అభినందనలు


బల్గేరియా పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ రూమెన్ రాదేవ్‌కు ప్రధానమంత్రి అభినందనలు

బల్గేరియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించిన‌ శ్రీ రూమెన్ రాదేవ్, ఆయన పార్టీ ‘ప్రోగ్రెసివ్ బల్గేరియా’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “భారతదేశం, బల్గేరియా మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఈ ప్రాంతంలో ఇరు దేశాల మ‌ధ్య‌ సహకారాన్ని పెంచుకోవడానికి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు:

“బల్గేరియా పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ రూమెన్ రాదేవ్, ఆయన పార్టీ ప్రోగ్రెసివ్ బల్గేరియాకు నా హృదయపూర్వక అభినందనలు.

భారతదేశం, బల్గేరియా మధ్య ఉన్న స్నేహపూర్వక, బహుముఖ సంబంధాలను మరింత బ‌లోపేతం చేయ‌డానికి, మన ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.”