Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


భారతదేశం గర్వించదగిన, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించిందని ప్రధానమంత్రి అన్నారు. ఆమె ఆలపించిన మధురగీతాల ద్వారా, శక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేదని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారు. రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారని, ఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“భారతదేశం గర్వించదగిన, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణం… బాధాకరం. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించింది. ఆమె ఆలపించిన మధురగీతాల ద్వారా, శక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి“

 

***