పిఎంఇండియా
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
పవిత్ర మాసమైన రమ్ జాన్ ను పురస్కరించుకొని బంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో పాటు బాంగ్లాదేశ్ ప్రజల కు కూడా భారతదేశం ప్రజల పక్షాన మరియు స్వయం గా తన తరఫు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి కారణం గా తలెత్తిన ప్రాంతీయ పరిస్థితుల ను గురించి ఉభయ నేత లు చర్చించారు; ఆ ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రభావాన్ని తగ్గించడం కోసం వారి వారి దేశాల లో చేపడుతున్నటువంటి చర్యల ను పరస్పరం వెల్లడించుకొన్నారు.
ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) సభ్యత్వ దేశాల నేత ల మధ్య మార్చి నెల 15వ తేదీ నాడు అంగీకారం కుదిరిన ప్రత్యేక వ్యవస్థల ను అమలు పరచడం లో నమోదైన ప్రగతి పట్ల ఇరువురు నేత లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్క్ కోవిడ్-19 అత్యవసర నిధి కి 1.5 మిలియన్ డాలర్ సహాయాన్ని సమకూర్చినందుకు ప్రధాని శేఖ్ హసీనా కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతం లో కోవిడ్-19 ని ఎదుర్కోనే దిశ గా జరుగుతున్నటువంటి ప్రయత్నాల కు నేతృత్వాన్ని అందిస్తున్నందుకు, అలాగే బాంగ్లాదేశ్ కు వైద్య సంబంధిత సరఫరాలు మరియు సామర్ధ్యం పెంపుదల .. ఈ రెండు విషయాల లోను మద్దతు ను ఇస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా ధన్యవాదాలు పలికారు.
రహదారులు, రైలు మార్గాలు, అంతర్దేశీయ జల మార్గాలు మరియు వాయు మార్గాల మాధ్యమాల ద్వారా సరిహద్దుల ఆవల కు అవసర వస్తువుల నిలవల సరఫరా ను కొనసాగిస్తుండడం పై ఇద్దరు నేత లు సంతృప్తి ని వెలిబుచ్చారు. చరిత్ర పరం గాను, సంస్కృతి పరం గాను, భాష పరం గాను మరియు సోదరభావం పరం గాను నెలకొన్న ఉమ్మడి బంధాల తాలూకు ద్వైపాక్షిక సంబంధాలు శ్రేష్ఠమైన స్థితి కి చేరుకొన్నాయని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తు కు తెస్తూ, కోవిడ్-19 వ్యాప్తి ని నియంత్రించడం లో బాంగ్లాదేశ్ కు సహాయం చేయడం కోసం భారతదేశం సిద్ధం గా ఉందంటూ హామీ ని ఇచ్చారు.
స్నేహశీలురైన బాంగ్లాదేశ్ ప్రజలందరి కి మరియు ప్రధాని శేఖ్ హసీనా కు ఈ చరిత్రాత్మకమైనటువంటి ముజిబ్ బార్ శో లో మంచి ఆరోగ్యం తో పాటు శ్రేయస్సు కూడా ప్రాప్తించాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
Spoke to PM Sheikh Hasina to greet her & the people of Bangladesh on the Holy Month of Ramzan. We discussed COVID-19 situation & ways India and Bangladesh can collaborate in the fight against it. Our relationship with Bangladesh will continue to be one of our highest priorities.
— Narendra Modi (@narendramodi) April 29, 2020