Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఆర్ఐసిఎస్(‘బ్రిక్స్’) బిజినెస్ ఫోర‌మ్ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


యువ‌ర్ ఎక్స లన్సిస్‌,

బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ లో పాలు పంచుకొంటున్న ప్ర‌ముఖులారా,

న‌మ‌స్కారం,
శుభ సాయంత్రం.

బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ లో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.  11వ బ్రిక్స్ స‌మిట్ కార్య‌క్ర‌మం యొక్క ఆరంభ‌ం ఈ ఫోర‌మ్ తోనే జరిగింది.  వ్యాపారాని కి అగ్రతాంబూలాన్ని ఇచ్చినందుకు బ్రెజిల్ అధ్య‌క్షుని కి, ఈ ఫోర‌మ్ నిర్వాహ‌కుల కు మరియున ఈ ఫోర‌మ్ లో పాలు పంచుకొంటున్న‌వారు అందరి కి ఇవే నా అభినంద‌న‌ లు.

మిత్రులారా,

ప్ర‌పంచ ఆర్థిక వృద్ధి లో బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాల వాటా 50 శాతం గా ఉంది.  ప్ర‌పంచం లో మాంద్యం త‌ల ఎత్తిన‌ప్ప‌టికి, బ్రిక్స్ కూటమి దేశాలు ఆర్థికాభివృద్ధి ని పెంపొందింప చేసుకొని, ల‌క్షల మంది ని పేద‌రికం వ‌ల‌యం లో నుండి బ‌య‌ట‌కు తీసుకు రావ‌డ‌మే కాకుండా సాంకేతిక విజ్ఞానం లో మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ లలో కొంగొత్త విజ‌యాల ను కూడా సాధించాయి.  బ్రిక్స్ ఏర్పడి పది సంవ‌త్స‌రాలు గడచిన తరువాత ప్రస్తుతం మున్ముందు మ‌న కృషి ఏ దిశ గా సాగాలి అనేది చ‌ర్చించ‌డానికి ఈ ఫోర‌మ్ ఒక మంచి వేదిక గా ఉంది.

మిత్రులారా,

బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని స‌ర‌ళ‌త‌రం చేసుకోవ‌డమనేది ఆయా దేశాల ప‌ర‌స్ప‌ర వ్యాపారాన్ని మ‌రియు పెట్టుబ‌డుల ను పెంచ‌గ‌లుగుతుంది.  మ‌న అయిదు దేశాల మ‌ధ్య ప‌న్ను సంబంధిత ప్ర‌క్రియ‌లు, క‌స్ట‌మ్స్ ప్ర‌క్రియ‌లు సుల‌భ‌త‌రం అవుతున్నాయి.  మేధోసంప‌త్తి హ‌క్కు లు మ‌రియు బ్యాంకు ల మ‌ధ్య స‌హ‌కారం తో వ్యాపార వాతావ‌ర‌ణం కూడా సాఫీ గా మారిపోతున్నది.  త‌ద్వారా జ‌నించే అవ‌కాశాల తాలూకు పూర్తి ప్ర‌యోజ‌నాల ను అందుకోవ‌డం కోసం అవ‌స‌ర‌మైన వ్యాపార కార్య‌క్ర‌మాల ను అధ్య‌యనం చేయ‌వలసిందంటూ బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్ ను నేను అభ్య‌ర్ధిస్తున్నాను.

బ్రిక్స్ దేశాల మ‌ధ్య వ్యాపార ల‌క్ష్యాలు మ‌రియు పెట్టుబ‌డి ల‌క్ష్యాలు మ‌హ‌త్వాకాంక్ష తో కూడిన‌వై ఉండాలి.  మ‌న దేశాల మ‌ధ్య వ్యాపార వ్య‌యం మ‌రింత గా త‌గ్గ‌డం లో మీరు అందించే సూచ‌న‌ లు స‌హాయ‌కారి కాగ‌లవు.

రాబోయే ప‌ది సంవ‌త్స‌రాల కాలాని కి గాను మ‌న దేశాల మ‌ధ్య వ్యాపారం లో ప్రాథ‌మ్య రంగాల ను గుర్తించాల‌ని, వాటి ఆధారం గా బ్రిక్స్ దేశాల మ‌ధ్య స‌హ‌కారాని కి ఒక న‌మూనా ను రూపొందించాల‌ని కూడా నేను అభ్య‌ర్థించ ద‌లుస్తున్నాను.

మిత్రులారా,

మ‌న విప‌ణి ప‌రిమాణం, వివిధ‌త్వం మ‌రియు మ‌న‌ లో మ‌నం ఒక దేశాని కి మ‌రొక దేశం పూర‌కం గా వ్య‌వ‌హ‌రించడం అనేవి మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రి కి చాలా లాభ‌దాయ‌కం గా ఉంటాయి.  ఉదాహ‌ర‌ణ కు తీసుకొంటే, ఒక బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశం లో సాంకేతిక విజ్ఞానం ఉంద‌నుకోండి; అప్పుడు మరొక స‌భ్య‌త్వ దేశం లో సంబంధిత ముడి స‌ర‌కులు గాని లేదా బ‌జారులు గాని ఉండి వుండ‌వ‌చ్చును.  అటువంటి అవ‌కాశాలు ప్ర‌త్యేకించి విద్యుత్తు తో న‌డిచే వాహ‌నాలు, ఎరువులు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు, డిజిట‌ల్ టెక్నాల‌జీ, ఫూడ్ ప్రాసెసింగ్ త‌దిత‌రాల లో నెల‌కొనివున్నాయి.  అయిదు బ్రిక్స్ దేశాల లో ఆ కోవ‌ కు చెందిన ప‌ర‌స్ప‌ర పూర‌కాల ను ప‌ట్టికీక‌రించవలసింది గా ఫోర‌మ్ ను నేను కోరుతున్నాను. నేను చేసే మరొక సూచన ఏమిటి అంటే క‌నీసం అటువంటి అయిదు రంగాల ను త‌దుప‌రి బ్రిక్స్ స‌మిట్ క‌ల్లా గుర్తించాలి.   ఆయా రంగాల లో ప‌ర‌స్ప‌ర పూర‌ణం ప్రాతిప‌దిక‌ న మ‌న దేశాల మ‌ధ్య సంయుక్త సంస్థ‌ల ను ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉండాలి మరి.

మిత్రులారా,

బ్రిక్స్ కూటమి దేశాల ప్ర‌జ‌ల క‌ఠోర శ్ర‌మ‌, ప్ర‌తిభ‌, ఇంకా సృజ‌నాత్మ‌క‌త‌ లు సుప్రసిద్ధమైనటువంటివి.  రేప‌టి శిఖర సమ్మేళనం సంద‌ర్భం గా ఇన‌వేశ‌న్ బ్రిక్స్ నెట్ వ‌ర్క్ మ‌రియు బ్రిక్స్ ఇన్స్ టిట్యూశన్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ నెట్ వ‌ర్క్ ల వంటి ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల పై చ‌ర్చ ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.  ఈ ప్ర‌య‌త్నాల లో ప్రైవేటు రంగాని క‌ల‌సి రావలసింది గా నేను అభ్య‌ర్థిస్తున్నాను.  ఈ కార్య‌క‌లాపాల కు యువ న‌వ పారిశ్రామిక‌వేత్తల సాయాన్ని తీసుకోవ‌డం సైతం వ్యాపారానికి మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కు మ‌రింత బ‌లాన్ని అందించ‌ గ‌లుగుతుంది.

మిత్రులారా,

మ‌న దేశాల మ‌ధ్య ప‌ర్య‌ట‌న లకు, వ్యాపారాలకు  మ‌రియు ఉద్యోగాలకు గాను రాక పోక ల అవ‌కాశాల ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు వీలు ఉంది.  భార‌తీయుల కు వీజా తో నిమిత్తం లేకుండానే ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తున్నందుకు బ్రెజిల్ అధ్య‌క్షుని కి నేను ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.  మ‌న అయిదు స‌భ్య‌త్వ దేశాలు ప‌ర‌స్ప‌రం సామాజిక భ‌ద్ర‌త ఒప్పందాన్ని గురించి కూడా ఆలోచ‌న చేయాలి.

మిత్రులారా,

భార‌త‌దేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లాజిస్టిక్ పర్ ఫార్మన్స్, ఇంకా గ్లోబ‌ల్ ఇనవేశ‌న్ ల వంటి సూచీల‌ లో నిరంత‌ర పురోగ‌తి ని సాధిస్తుండ‌టం గురించి న ఎరుక మీకు ఉండే ఉంటుంది.  సమయ సీమ కార‌ణం గా నేను ఒక్క విషయాన్ని మటుకు చెప్తాను; అది ఏమిటి అంటే భార‌త‌దేశం రాజ‌కీయ ప‌రం గా స్థిర‌త్వం, ముందు గా అంచనా వేయ‌డాని కి వీలు ఉండే విధానాలు మ‌రియు వ్యాపారాని కి అనుకూలంగా ఉండేట‌టువంటి సంస్క‌ర‌ణ‌ ల కార‌ణం గా ప్ర‌పంచం లో అత్యంత బాహాట‌మైన‌టువంటి మ‌రియు పెట్టుబ‌డి కి స్నేహశీలమైన‌టువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంది అనే సంగతే. 2024వ సంవ‌త్స‌రం క‌ల్లా 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా భార‌తదేశాన్ని తీర్చిదిద్దాల‌ని మేము కోరుకొంటున్నాము.  దీనికి గాను ఒక్క మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌ కే 1.5 ట్రిలియ‌న్ డాల‌ర్ పెట్టుబ‌డి అవసరమవుతుంది.

భార‌త‌దేశం లో అవ‌కాశాలు అపారం గా ఉన్నాయి.  అవి అసంఖ్యాకంగా కూడా ఉన్నాయి.  ఆ అవకాశాల ను వినియోగించుకోవ‌డం కోసం బ్రిక్స్ దేశాల వ్యాపార సంస్థ‌ లు భార‌త‌దేశం లో వాటి ఉనికి ని నెల‌కొల్పుకోవ‌డం తో పాటు ఆ ఉనికి ని వ‌ర్ధిల్లజేసుకోవ‌ల‌సింది గా నేను ఆహ్వానం ప‌లుకుతున్నాను.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.