Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్ లో రేపు ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 అక్టోబ‌ర్ 14వ తేదీన బిహార్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ప‌ట్నా విశ్వ‌విద్యాల‌యం శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌లో ప్ర‌ధాన మంత్రి పాల్గొని ప్ర‌సంగిస్తారు.

న‌మామీ గంగే కార్య‌క్ర‌మంలో భాగంగా మొకామా లో నాలుగు మురికి నీటి ప‌థ‌కాల‌కు మ‌రియు నాలుగు జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్య‌యం రూ. 3,700 కోట్ల‌కు పైనే. అలాగే, ఒక బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

నాలుగు మురికి నీటి ప‌థ‌కాల‌లో.. బ్యూర్ లోని మురుగు శుద్ధి ప్లాంటు, బ్యూర్ లోనే స్యువరిజ్ సిస్ట‌మ్ విత్ స్యువర్ నెట్‌వ‌ర్క్‌, క‌ర్మాలీచక్ లో స్యూఇజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు తో పాటు సైద్‌పుర్ లో ఎస్‌టిపి, ఇంకా స్యువర్ నెట్‌వ‌ర్క్‌లు.. ఉన్నాయి. ఈ ప‌థ‌కాలు అన్నీ క‌లిసి బ్యూర్ లో ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి 20 ఎమ్ఎల్‌డి స్థాయిని పెంపొందించ‌డ‌మే కాక, 120 ఎమ్ఎల్‌డి తో కూడిన ఒక కొత్త ఎస్‌టిపి ని సైతం ఏర్పాటు చేస్తాయి.

శంకుస్థాప‌న జ‌ర‌గ‌నున్న నాలుగు జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టుల‌లోనూ:

• ఎన్‌హెచ్‌-31 తాలూకు ఓంటా-సిమరియా సెక్ష‌న్‌ను 4 దోవ‌ల మార్గంగా తీర్చిదిద్ద‌డం మ‌రియు 6-దోవ‌లు ఉండే విధంగా గంగా సేతువును నిర్మించ‌డం

• ఎన్‌హెచ్‌-31 లో భ‌క్తియార్‌పుర్-మొకామ సెక్ష‌న్‌ ను 4 దోవ‌ల మార్గంగా నిర్మించ‌డం

• ఎన్‌హెచ్‌-107 లో మ‌హేశ్‌కుంట్‌-స‌హ‌ర్సా-పుర్ణియా సెక్ష‌న్ ను 2-దోవ‌ల మార్గంగా నిర్మించడం

• ఇంకా, ఎన్‌హెచ్‌-82 లో బిహార్‌శరీఫ్-బాడ్‌బీఘా-మొకామ సెక్ష‌న్‌ ను 2-దోవ‌ల మార్గంగా నిర్మించ‌డం.. భాగంగా ఉంటాయి.

***