Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగ‌ళూరు సిటీ-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం మృతుల‌కు ప్ర‌ధాని సంతాపం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పూర్ జిల్లాలో జ‌రిగిన‌ బెంగ‌ళూరు – నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం మృతుల‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ దుర‌దృష్ట‌క‌ర ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన క‌ర్ణాట‌క ఎమ్మెల్యే శ్రీ వెంక‌టేశ్ నాయ‌క్ కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నాను. శ్రీ వెంకటేశ్ నాయ‌క్ ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి చేసిన సేవ‌లు ఆయ‌న‌ను నిరంత‌రం గుర్తుండిపోయేలా చేస్తాయి అని ప్ర‌ధాని త‌న సందేశంలో పేర్కొన్నారు.

***