Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్జియంతో రెండు సార్లు పన్ను విధింపు నివారణకు మరియు కోశ సంబంధి ఎగవేత నిరోధానికి కుదిరిన ఒప్పందంలో సవరణ నిమిత్తం ఓ ఒడంబడికల ప్రాథమిక పత్రానికి మంత్రిమండలి ఆమోదం


భారతదేశం, బెల్జియంల మధ్య రెండు సార్లు పన్ను విధింపు నివారణకు, ఆదాయపు పన్ను చట్టాలలో కోశ సంబంధి ఎగవేత నిరోధానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని సవరించేటందుకు ఒక ఒడంబడికల ప్రాథమిక పత్రం (ప్రోటోకాల్) పైన సంతకాల ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రోటోకాల్ లో సవరణ రెండు దేశాల మధ్య పన్నులకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న ఫ్రేమ్ వర్క్ పరిధిని విస్తరించగలదు. తత్ఫలితంగా పన్ను ఎగవేతను, పన్ను నివారణ ను అరికట్టగలగడం సాధ్యపడనుంది. పన్నుల వసూలులో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనలను కూడా ఈ ప్రోటోకాల్ సరిదిద్దగలదు.

***