Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బేనామీ లావాదేవీల (నిషేధం) సవరణ బిల్లు, 2015 లో సవరణకు మంత్రిమండలి ఆమోదం


బేనామీ లావాదేవీల (నిషేధం) సవరణ బిల్లు, 2015 లో సవరణలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

బిల్లు చట్ట రూపం దాల్చాక ఇందులోని నిబంధనలను అమలు చేయడంలో తలెత్తగల ఇబ్బందులను అధిగమించగలిగేందుకు బిల్లును చట్టపరంగాను, పరిపాలన ప్రక్రియ పరంగాను బలోపేతం చేసేందుకు ఈ సవరణలను ఉద్దేశించారు.

బేనామీ లావాదేవీలను కట్టుదిట్టంగా నిషేధించడం, అసమంజసమైన పద్ధతుల ద్వారా చట్టం నుంచి తప్పించుకోవడాన్ని నిరోధించడం కూడా ఈ చట్టం ఉద్దేశాలే. బేనామీ ఆస్తిని తగిన కార్యసరళిని అవలంబిస్తూ జప్తు చేసుకొనేందుకు ప్రభుత్వానికి అధికారాలను ఈ చట్టం దత్తం చేస్తుంది. ఈ కారణంతో పౌరులందరిలోను సమానత్వాన్ని ఈ చట్టం పెంపొందిస్తుంది. అయితే, ఆదాయ వెల్లడి పథకం లో భాగంగా బేనామీ ఆస్తులను వెల్లడి చేసే వారు బేనామీ చట్టం నుండి మినహాయింపును పొందగలుగుతారు.