Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బోడో ప్ర‌జ‌ల‌ కు ఒక నూత‌న ఆరంభాన్ని ప్రకటించిన బోడో ఒప్పందం; ఇది అస‌మ్ యొక్క ఏక‌త ను మరియు అఖండ‌త ను బ‌లోపేతం చేస్తుంది: ప‌రక ధాన మంత్రి


అస‌మ్ లో శాంతి మ‌రియు అభివృద్ధి లలో బోడో ఒప్పందం ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన అధ్యాయం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభివ‌ర్ణించారు. బోడో ఒప్పందాన్ని ఆయ‌న కొనియాడుతూ, ఈ ఒప్పందం ‘స‌బ్‌కా సాథ్ స‌బ్‌కా వికాస్ మ‌రియు స‌బ్‌కా విశ్వాస్’ మంత్రం నుండి, అలాగే ‘ఏక్ భార‌త్ – శ్రేష్ఠ్ భార‌త్’ స్ఫూర్తి నుండి ప్రేర‌ణ ను పొందింద‌న్నారు.

ట్విట‌ర్ లో ఆయ‌న త‌న అభిప్రాయాల ను వెల్ల‌డిస్తూ, ‘‘పూజ్య బాపు ను ఆయ‌న వర్ధంతి నాడు భాత‌ర‌దేశం స్మ‌రించుకొంటూ ఉన్న త‌రుణం లో, శాంతి మరియు అభివృద్ధి తాలూకు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన‌టువంటి అధ్యాయానికి సాక్షి గా అస‌మ్ నిల‌చింది. 50 సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ అనంత‌రం, మ‌న బోడో మిత్రుల తో ఒప్పందం ఒక నూత‌న ఆరంభాన్ని ప్రకటిస్తోంది. ఇది అస‌మ్ యొక్క ఏక‌త ను బ‌ల‌ప‌ర‌చి, అభివృద్ధి ని, ఒక ఉజ్వ‌ల భ‌విత‌ ను ప్ర‌సాదిస్తుంది.

బోడో సంస్థ‌ల తో ఈ చ‌రిత్రాత్మ‌క ఒప్పందం పై సంత‌కాలు చేశాక, మా ప్ర‌భుత్వం యొక్క తొలి ప్రాథ‌మ్యం బోడో ప్రాంతాల అభివృద్ధే. 1500 కోట్ల రూపాయ‌ల విలువైన ఒక స‌మ‌గ్ర ప్యాకేజీ తాలూకు పని మొద‌లైంది. జీవ‌నాన్ని సుల‌భ‌త‌రం గా మార్చ‌డంపైన, ఇంకా బోడో లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల నుండి పూర్తి ప్ర‌యోజ‌నాన్ని పొందే విధం గా చూడ‌టంపైన మేము ప్ర‌త్యేకం గా శ్రద్ధ వహిస్తాము.

శాంతి బాట లో మన‌తో బోడో మిత్రులు కలసి నడవడం హింస పథాన్ని వీడి, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని మనం నమ్మితే స‌మ‌స్య‌ల కు ప‌రిష్కారం సాధ్యమే అనేటటువంటి స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నది. ప్ర‌ధాన స్ర‌వంతి లోకి నేను నా యొక్క బోడో స్నేహితుల ను ఆహ్వానిస్తున్నాను. బోడో ప్రాంతాల వికాసానికి మేము కట్టుబడి ఉన్నాము.

అయిదు ద‌శాబ్దుల కింద‌టి బోడో స‌మ‌స్య కు పూజ్య బాపు వ‌ర్ధంతి అయిన ఈ రోజు న పరిష్కారం కనుగొనబడింది. ప్ర‌భుత్వాని కి, బోడో బృందాల కు మ‌ధ్య కుదిరిన సంధి అస‌మ్ యొక్క ఏక‌త ను, అఖండ‌త ను ప‌టిష్ట ప‌రుస్తుంది. హింస ను త్య‌జించి, ప్ర‌జాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని నమ్మి అధీనం లో ఉంచాలనే నా యొక్క బోడో మిత్రుల నిర్ణ‌యాన్ని నేను స్వాగ‌తిస్తున్నాను.

మ‌న బోడో మిత్రుల‌ తో ఒడంబ‌డిక అనేది దేశం లో హింస బారిన బ‌డిన ప్రాంతాల కు మ‌రియు అస‌మ్ కు ఒక సందేశం గా ఉన్నది. హింస కు మ‌రియు భీతి కి తావు లేన‌టువంటి వాతావ‌ర‌ణం లో మాత్ర‌మే దేశాభివృద్ధి కి వేగాన్ని సంత‌రించ‌వ‌చ్చును. మ‌న బోడో మిత్రుల యావ‌త్తు శ‌క్తి అస‌మ్ అభివృద్ధి ని మ‌రింత గా బ‌ల‌ప‌రుస్తుంద‌నే విష‌యం సంతోషదాయకం.

అస‌మ్ లో ఇత‌ర స‌ముదాయాల హితాన్ని ప‌రిర‌క్షిస్తూ మ‌న బోడో స్నేహితుల తో ఒప్పందం కుదిరింది. ఇది అంద‌రి జ‌యం, ఇది మాన‌వాళి కోసం సాధించిన‌ అటువంటి విజ‌యం. ఇది ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ మ‌రియు స‌బ్‌కా విశ్వాస్’ మంత్రం తో, అలాగే ‘ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ్ భార‌త్’ తాలూకు స్ఫూర్తి తో ప్రేరేపిత‌మ‌యింది’’ అని వివ‌రించారు.