Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ నాయకుల సర్వసభ్య సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగత వ్యాఖ్యలు

బ్రిక్స్ నాయకుల సర్వసభ్య సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగత వ్యాఖ్యలు


శ్రేష్టుడైన అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్, శ్రేష్టుడైన అధ్యక్షుడు శ్రీ జేకబ్ జూమా, శ్రేష్టుడైన అధ్యక్షుడు శ్రీ మైకేల్ టెమెర్, శ్రేష్టుడైన అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్,

ప్రముఖ ప్రతినిధులారా,

గోవాలో జరుగుతున్న బ్రిక్స్ ఎనిమిదో శిఖరాగ్ర సమావేశానికి మీకు మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్న 125 కోట్ల మంది భారతీయులతో నేనూ ఒకరిని.

బ్రిక్స్ నాయకుల సర్వసభ్య సదస్సుకు అధ్యక్షత వహిస్తుండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు ఇంతక్రితం జరిగిన మన చర్చలు నిర్మాణాత్మకమైనవి.

ఈ సమావేశం

వాటిని ఆధారంగా చేసుకొని మరింతగా మెరుగుపరుస్తూ, బ్రిక్స్ కోసం కార్యక్రమాల చురుకైన అజెండా మీద చర్చించాలి.

ఆర్థిక కార్యకలాపాల విశాల రంగాల్ని చేర్చుకొనేందుకు గాను, కొంత కాలంగా అంతర బ్రిక్స్ ఒప్పందపు పాదముద్ర విస్తరించింది.

ఇవాళ మన భాగస్వామ్యపు పరిధి వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగానికీ మరియు ఆవిష్కరణకూ; వాణిజ్యం నుండి పర్యాటక రంగానికీ; పర్యావరణం నుండి ఇంధన రంగానికీ; చలనచిత్రాల నుండి
ఫుట్‌బాల్‌కూ; నైపుణ్యాల అభివృద్ధి నుండి స్మార్ట్ సిటీలకూ; లంచగొండితనం మరియు మనీ లాండరింగ్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటం నుండి మన సమాజాల రక్షణ వరకు విస్తరించింది.

ఈ సంవత్సరం మనం బ్రిక్స్ ను మన నగరాలకూ, ప్రాంతాలకూ తీసుకువెళ్ళి వివిధ రంగాల ప్రజలకు నేరుగా అనుసంధానం చేశాము.

శ్రేష్టులారా,

బ్రిక్స్ కింద మన 10 సంవత్సరాల భాగస్వామ్యాన్ని ఒక పండుగగా జరుుపకొంటున్నాము. ఒక దశాబ్ద కాలంగా కలసి పని చేయడం సహకారపు బలమైన ప్రయోజనాలను ఉత్పత్తి చేసింది.

మన కార్యక్రమాలలో, విజయ సాధనలలో గర్వించేందుకు అర్హులము.

నవ్య అభివృద్ధి బ్యాంకు (ఎన్ డి బి) ని స్థాపించడం, అత్యవసర రిజర్వు ఏర్పాటు నిజానికి మన స్వంత ముద్ర ఉన్న విజయాలు.

భద్రత సంబంధమైన నూతన సవాళ్ళు మరియు కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితాలు ఉన్న ప్రపంచంలో బ్రిక్స్ శాంతిని ప్రసాదించగల శక్తి గాను, ఒక వాగ్ధానంగాను నిలబడుతుంది.

అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి మన పని ఎంతో అర్థవంతమైనటువంటిది.

మార్పు మరియు అభివృద్ధి కొరకు గ్లోబల్ అజెండాను రూపొందించడంలో గత సంవత్సరంలో బ్రిక్స్ దేశాలు చాలా చురుకైన పాత్రను పోషించాయి.

అజెండా 2030, ప్యారిస్ వాతావరణ ఒప్పొందం మరియు అభివృద్ధి కోసం నిధులను సమకూర్చడం కోసం అదిస్ అబాబా యాక్షన్ అజెండా లతో మన సాంగత్యం ఉపయోగకరంగానూ, నిర్మాణాత్మకంగానూ ఉంది.

అంతే కాకుండా, ప్రపంచ పాలనా స్వరూపాలలో మార్పును తీసుకొని రావడంలో మనం అగ్రభాగాన నిలిచాము.

శ్రేష్టులారా,

మన విజయాలు గణనీయమైనవి అయినప్పటికీ, అంతర బ్రిక్స్ ఒడంబడిక యొక్క సానుకూల దిశనూ, బలమైన ఊపును మనం సుస్థిరపరచవలసిన అవసరం ఉంది.

దానికి మరింత సారాన్ని అందించవలసిన అవసరం ఉంది.

మీ పరిశీలన కోసం నేను కొన్ని ఆలోచనల్ని మీతో పంచుకొంటాను.

మొదటిది, బ్రిక్స్‌ లో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ మీద మన కేంద్రీకరణ తప్పనిసరిగా కొనసాగాలి.

మనం నిర్మించిన సంస్థలు మన దేశాల, ప్రాంతాల అభివృద్ధికి అండగా నిలవాలి.

అవి మరింత సారళ్యాన్నీ, స్వేచ్చనూ సంతరించుకొని, మన అభివృద్ధి ప్రాధాన్యాలకు స్పందించడంలో, మరింత విస్తృత ఎంపికలను అందజేయాలి.

బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క భావనను వాస్తవంలోకి తర్జుమా చేయడానికి మనం ఎదురు చూస్తున్నాము.

బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, బ్రిక్స్ రైల్వే పరిశోధనా నెట్‌వర్క్ మరియు బ్రిక్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ లను నెలకొల్పే పనిని మనం తప్పకుండా వేగవంతం చెయ్యాలి.

పన్నుల చెల్లింపు ఎగవేతకు, నల్లధనం మరియు లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడాలి.ఇందుకోసం మన శక్తియుక్తులను కలబోసుకొని, తగిన వ్యవస్థలను నిర్మించి, నిబంధనలను రూపొందించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

పన్నుల సంబంధి అపరాధులను, మనీ లాండరర్ల ను చట్టానికి పట్టి ఇవ్వడం కోసం అవసరమైన సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకొనేందుకు అనువైన యంత్రాంగాలను సైతం మన ఏజెన్సీలు తయారు చేసుకోవాలి.

ఇవాళ్టి వాస్తవికతను ప్రతిఫలించేందుకు గాను ప్రపంచ పాలనా వ్యవస్థలకు సాధికారికత కలిగించేందుకు బ్రిక్స్ చొరవ తీసుకోవాలి.

రెండోది, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య మరియు పెట్టుబడి లింకేజీల పరిణామాన్నీ, నాణ్యతను మార్చాలి.

2015లో బ్రిక్స్ దేశాల అంతర్గత వాణిజ్యం సుమారు 250 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది.

2020 కల్లా ఈ సంఖ్యను ద్విగుణీకృతం చేసి, ఐదు వందల యూఎస్ డాలర్ల లక్ష్యాన్ని మనకు మనం నిర్దేశించుకోవాలి.

ఇందు కోసం ఐదు దేశాలలోనూ వ్యాపారం మరియు పారిశ్రామిక రంగం తమ పాత్రను మరింత పెంచుకోవాలి.

మరియు ప్రభుత్వాలు ఈ ప్రక్రియకు పూర్తిగా తోడ్పాటును అందించాలి. పన్నులు మరియు కస్టమ్ సహకార చట్రానికి సంబంధించిన మన ఒప్పందం ఒక శుభారంభం.

న్యూ ఢిల్లీలో ఇటీవలే ముగిసిన బ్రిక్స్ ట్రేడ్ ఫెయిర్ మరియు ఎగ్జిబిషన్ వ్యాపార పరస్పర మార్పిడులకు ఒక నిరంతర వేదిక కావాలి.

ఇంకా, ఈ లక్ష్యానికి మద్ధతునివ్వడంలో బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ చురుకైన పాత్రను పోషించాలి.

మన చిన్న , మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ ఎం ఇ లు) గ్లోబల్ వేల్యూ చెయిన్లలో కలవడం కోసం కూడా ఇది సహాయపడుతుంది. దోహా డెవలప్‌మెంట్ రౌండ్ మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ

(డబల్యుటీఓ) కీలక పాత్రను పరిరక్షించుకోవడం కోసం కూడా మనం మరింత సమన్వయంతో పని చేయాలి.

దీనితో పాటు, జి-20, డబ్ల్యు టి ఒ మరియు ఇతర వేదికలలో మన సహకారాన్నీ, ఏకీముఖత్వాన్ని పెంచాలి.

డబ్ల్యు టి ఒ లో సేవల కోసం ట్రేడ్ ఫెసిలిటేషన్ ఒప్పందపు చిత్తు ప్రతిని భారతదేశం టేబుల్ మీదికి తీసుకువచ్చింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు సేవల సరళీకరణ మరియు వాణిజ్య ప్రయోజనాలను గరిష్ట స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ ఒప్పందం ప్రయత్నిస్తుంది.

ఈ ప్రతిపాదనకు బ్రిక్స్ నుంచి బలమైన మద్ధతు లభించడం మన సమిష్టి ఆర్థిక ప్రయోజనాలకు అవసరం.

మూడోది, మన ఆర్థిక పరివర్తనల తాలూకు కీలక ప్రాధాన్యాల మీద దృష్టిని కేంద్రీకరించాలి.

బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలలో కేంద్రీకరించాల్సిన కీలక రంగాలకు నగరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన మరియు నూతన ఆవిష్కరణలు ప్రాతినిధ్యం వహిస్తాయి.

భారతదేశపు నాయకత్వంలో, డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీలు, నగరీకరణ మరియు మన నగరాల మధ్య సహకారం-వీటికి మనం ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం.

రాబోయే వంద కోట్ల ఇంటర్ నెట్ వినియోగదారులు కొత్తగా ఎదుగుతున్న విపణుల నుండే వస్తారు.

మన ఆర్థిక వ్యవస్థల మౌలిక నిర్మాణాన్ని సమూలంగా మార్చే ఈ అవకాశాన్ని మన సహకారం అంది పుచ్చుకోవాలి.

నాలుగోది, మన సమాజలకు భద్రతను కల్పించడం.

ఇవాళ మనం నివసిస్తున్న ప్రపంచంలో, మన పౌరులకు భద్రతను కల్పించాలనుకుంటే, భద్రత మరియు ఉగ్రవాద వ్యతిరేక సహకారం తప్పని సరి.

మన అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సు మీద ఉగ్రవాదం తన పడగను విప్పి ఉంచింది.

ఈ పడగ నీడ ఇప్పుడు యావత్తు ప్రపంచానికి వ్యాపించింది. అది ప్రాణాంతకంగా మారిపోయింది.

అంతే కాకుండా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఆరితేరింది.

అందువల్ల, ఉగ్రవాదానికి మన స్పందన కూడా సమగ్రంగానే ఉండాలి తప్ప తక్కువ స్థాయిది కాకూడదు.

అంతే కాకుండా, మనం ఒంటరిగానూ, సమష్టిగానూ పని చెయ్యాలి. ఉగ్రవాద వ్యక్తులకూ, సంస్థలకూ వ్యతిరేకంగా విడి విడి విధానాలు నిష్ఫలమైనవే కాక, ప్రతికూల ఫలితాలను అందిస్తాయి.

కృత్రిమ మరియ స్వీయ సేవల పునాదిగా ఎటువంటి భేదమూ ఉండకూడదు.

ఉగ్రవాద చర్యలకు బాధ్యులైన వ్యక్తులకూ, సంస్థలకూ వ్యతిరేకంగా తీసుకునే శిక్షాత్మక చర్యకు నేర ప్రవర్తన మాత్రమే భూమికగా ఉండాలి.

ఉగ్రవాదులకు అందే నిధులను,ఆయుధాలను, శిక్షణను, ఇంకా రాజకీయ మద్ధతును ఒక పద్ధతి ప్రకారం నిరోధించాలి.

ఈ విషయంలో, మన జాతీయ భద్రతా సలహాదారుల మధ్య భద్రతా సహకారాన్ని మనం మరింత తీవ్రతరం చెయ్యాలి.

అంతర్జాతీయ ఉగ్రవాదం మీద సమగ్ర ఒప్పందపు ప్రతిని త్వరగా ఆమోదించడం ఈ బెడదకు వ్యతిరేకంగా పోరాడాలనే మన సంకల్పానికి ఒక వ్యక్తీకరణగా ఉంటుంది.

ఐదోది, ప్రజల నుండి ప్రజలకు మార్పిడిని పెంచడం బ్రిక్స్ కు జీవ సారాన్ని ఇస్తుంది.

ఇది మన భాగస్వామ్యానికి ఒక వడినీ, వైభవాన్నీ తీసుకురాగలదు.

బ్రిక్స్ చలన చిత్రోత్సవం, ట్రేడ్ ఫెయిర్, స్పోర్ట్స్ కౌన్సిల్, ఫుట్‌బాల్ టోర్నమెంట్ మరియు సంబంధిత కార్యకలాపాలు అంతిమంగా మన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగే లక్షలాది యువతీ యువకులను తయారు చేస్తాయి.

శ్రేష్టులారా,

మరింత బలమైన,లోతైన మరియు ప్రకాశవంతమైన బ్రిక్స్ సమూహం కోసం వారి విజన్ గురించి నా తోటి బ్రిక్స్ నాయకులు చెప్పేది ఆలకించడం కోసం నేను ఎంతో ఆసక్తితో ఉన్నాను.

నా ప్రసంగాన్ని చెవి ఒగ్గి విన్నందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు.

కృత‌జ్ఞ‌త‌లు.