Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధికి భవిష్యత్తు నిర్మాణం’’ చర్చలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం

బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధికి భవిష్యత్తు నిర్మాణం’’ చర్చలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం


యువర్ హైనెస్,
ఎక్సలెన్సీస్
నమస్కారం!
బ్రిక్స్ కుటుంబంలోకి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం
ఈ రోజు.. ఈ సభ.. ఖండాలనుసంస్కృతులనువైవిధ్యమైన అభివృద్ధి ప్రయాణాలను ఒక్క చోట చేర్చిందిబ్రిక్స్‌పై పెరుగుతున్న సామర్థ్యానికిఆకర్షణకుఅపూర్వమైన విశ్వాసానికి ఇది నిదర్శనం.

మిత్రులారా,
భారత్ అధ్యక్షతన నాలుగు ప్రధానాంశాలపై మన ప్రయత్నాలన్నింటినీ కేంద్రీకరించాంఅవి స్థిరత్వంఆవిష్కరణసహకారంసుస్థిరతమీ అందరి సహకారంతోడ్పాటుతో మన ఉమ్మడి లక్ష్యాన్ని అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చినందుకు సంతోషిస్తున్నాను.
ప్రస్తుత ప్రపంచంలో సంఘర్షణలుఉద్రిక్తతల సంఖ్య నిరంతరం పెరుగుతోందిఇది సాధారణ ప్రజల జీవితంపై ప్రతికూలమైనదీర్ఘకాలికమైన ప్రభావాన్ని చూపిస్తోంది.
పరస్పరం అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచంలో.. మహమ్మారులువాతావరణ విపత్తులుసరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావుఅందుకే బ్రిక్స్ కూటమిలో స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు మేం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాంసవాళ్లను సకాలంలో గుర్తించడంవాటికి సిద్ధంగా ఉండటంతక్షణ చర్యను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఈ విధానంతోనే అంటు వ్యాధుల నివారణప్రతిస్పందన కోసం బ్రిక్స్ సమీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై మేం అంగీకారానికి వచ్చాంవిపత్తు నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార ఏకీకరణ మార్గదర్శకాలను సిద్ధం చేశాంమన సరఫరా వ్యవస్థలను మరింత విశ్వసనీయంగాపటిష్టంగా మార్చేందుకు బ్రిక్స్ సరకు రవాణా సరఫరా వ్యవస్థ సహకార విధానం దోహదపడుతుంది.
మిత్రులారా,
ఆవిష్కణర రంగంలో మన అంకుర సంస్థలనుఇంక్యుబేటర్లను ఒకదానితో ఒకటి బ్రిక్స్ ఇంక్యుబేటర్ వ్యవస్థ అనుసంధానిస్తుందిఆవిష్కరణలనుఆచరణ సాధ్యమైన పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను మేం ప్రతిపాదించాం.

రైతులకు నూతన అవకాశాలను డిజిటల్ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన బ్రిక్స్ నెట్‌వర్క్ అందిస్తుందిఈ కార్యక్రమం ద్వారా ఏఐజియోస్పేషియల్ టెక్నాలజీడిజిటల్ పౌర మౌలిక వసతులను రైతుల వాస్తవ అవసరాలకు అనుసంధానిస్తాం.  
సాంకేతిక పరిజ్ఞానాన్నికీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం.. మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుందిఅందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమ్మిళిత్వానికి మేం ప్రాధాన్యమిచ్చాం.  

మిత్రులారా

బ్రిక్స్ వేదిక ద్వారా స్నేహంభాగస్వామ్యంసహకారాన్ని భారత్ ముందుకు తీసుకెళ్లింది.
కేవలం ప్రభుత్వాలకు మాత్రమే బ్రిక్స్ సహకారాన్ని పరిమితం కాకుండా ఉండేలా చూసేందుకే మేం ప్రయత్నిస్తున్నాంమన వ్యాపారవేత్తలనూరైతులనూపరిశోధకులనూమహిళలనూయువతనూసాధారణ పౌరులనూ ఇందులో చురుకైన భాగస్వాములుగా చేయడానికి మేం కృషి చేస్తున్నాం.
నైపుణ్యాలనూఉపాధి అవకాశాలనూశ్రామికశక్తిలో మహిళలనూసామాజిక భద్రతనూసామర్థ్య నిర్మాణాన్ని బ్రిక్స్ కనెక్ట్ ద్వారా ప్రోత్సహించాం.
విజ్ఞానంతోరుణాలతోకొత్త మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానించేందుకు బ్రిక్స్ ఎంఎస్ఎంఈ కోపరేషన్ పోర్టల్ ప్రారంభించాం.
మన నగరాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడాన్ని సులభతరం చేసేందుకు బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ఏర్పాటయింది.
మిత్రులారా,  

భారతీయ నాగరికతలో ప్రకృతికి తల్లి స్థానం ఇచ్చాంశతాబ్దాలుగా అభివృద్ధి పర్యావరణం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయాలు కాదనీపరస్పరం తోడ్పాటు అందించుకొనేవని మేం విశ్వసిస్తున్నాంబ్రిక్స్‌లో కూడా మానవ అభివృద్ధికీపర్యావరణానికీ మధ్య సమతౌల్యాన్ని సాధించాల్సిన అవసరాన్ని మేం స్పష్టం చేస్తున్నాం.

ఇదే సుస్థిరతకు పునాదిభవిష్యత్తు తరాల పట్ల ఇది మన బాధ్యత కూడాఈ దిశగా మేం అనేక రంగాల్లో పురోగతిని సాధించాం.

స్మార్ట్ గ్రిడ్‌లువిద్యుత్ నిల్వ కోసం.. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశాంఇది మన శుద్ధ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగాసమర్థంగాఅందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి దోహదపడుతుంది.

ఆగ్రోఎకాలజీరీజనరేటివ్ అగ్రికల్చర్ కోసం ఏర్పాటుచేసిన ఎక్సలెన్స్ కేంద్రాలు సంప్రదాయ విజ్ఞానాన్నిఆధునిక సైన్స్‌తో అనుసంధానిస్తాయిస్వదేశీ విజ్ఞానాన్ని వాతావరణ ప్రయత్నాలకు ముఖ్యమైన పునాదిగా సమాజ ఆధారిత వాతావరణ స్వీకరణ కోసం అభివృద్ధి చేసిన సూత్రాలు మారుస్తాయి.
మిత్రులారా,
ఈ నాలుగు ప్రధానాంశాలను ఆధారంగా చేసుకొని బ్రిక్స్ ద్వారా సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించేందుకు కృషి చేశాంబ్రిక్స్ పరిధిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ఫలాలు కేవలం బ్రిక్స్ దేశాలకే పరిమితం కాకూడదని భావిస్తున్నాంవాటిని అందరికీ అందుబాటులోగ్లోబల్ సౌత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా తయారు చేయాలి.

మిత్రులారా,
బ్రిక్స్‌పై గ్లోబల్ సౌత్ దేశాల విశ్వాసం పెరిగిందని నా వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్నానుఎందుకంటే బ్రిక్స్‌లో:
వారి మాటలకు ప్రాధాన్యం లభిస్తుంది.
వారి అనుభవాలకు గౌరవం దక్కుతుంది.
వారి కోసం మాత్రమే కాకుండా.. వారి భాగస్వామ్యంతో పరిష్కారాలు రూపుదిద్దుకుంటాయి

మన వైవిధ్యంసహకారంలోనే బ్రిక్స్ సామర్థ్యం దాగుంది.
మనవి భిన్నమైన నేపథ్యాలు అయినప్పటికీ పరస్పర సహకారంతో కలసి ఎదుగుతూ మానవాళి  శ్రేయస్సు కోసం అభివృద్ధి సాధిద్దాం.

మన భిన్నత్వమే మన గుర్తింపుగా నిలవాలిమన సహకారమే మనకు స్ఫూర్తి కావాలిమన ప్రగతి సమస్త మానవాళి సంక్షేమానికి ఉపయోగపడాలి.
ధన్యవాదాలు

 

****