Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటన్ మహారాణికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బహుమతుల సమర్పణ

బ్రిటన్ రాణికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పలు విలువైన బహుమతుల్ని బహూకరించారు. 1961 సంవత్సరంలో జనవరి, ఫ్రిబ్రవరి నెలల్లో బ్రిటన్ మహారాణి తన మొట్ట మొదటి భారతీయ పర్యటన చేశారు. ఆ సమయంలో ఆమె న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యటన సందర్భంగా తీసిన పలు ఛాయా చిత్రాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బ్రిటన్ మహారాణికి బహూకరించారు. ఈ పర్యటనలో బ్రిటన్ మహారాణి భారతదేశంలోని పలు ప్రధాన నగరాలను సందర్శించారు. వారణాసి, అహమ్మదాబాద్, జైపూర్, ఉదయపూర్, కొల్ కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై సహా మరికొన్ని నగరాలలో కూడా పర్యటించారు.

ప్రధాని బహూకరించిన ఛాయాచిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి ఫోటో 1961, జనవరి 31న తీసినది. అహమ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్నిసందర్శించిన సందర్భంలో తీశారు. మహాత్మాగాంధీ 13 వ వర్ధంతి కార్యక్రమం తర్వాతి రోజున ఈ ఫోటోను తీశారు. రెండవ ఫోటోను ఫిబ్రవరి 19న చెన్నైలో తీశారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం మహారాణి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఆహ్వాన కార్యక్రమ సందర్భంగా దీన్ని తీశారు. డ్యూక్ ఆఫ్ యార్క్ హెచ్.ఆర్.హెచ్. ప్రిన్స్ శ్రీ ఆండ్రూ మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మద్రాసు ప్రభుత్వం బ్రిటన్ మహారాణికి కేకును బహూకరించింది. ఆ కేకును మహారాణి కట్ చేస్తున్నప్పటి ఫోటోనే ఇది. ఇక మూడో ఫోటో విషయానికి వస్తే, దీన్ని 1961 ఫ్రిబ్రవరి 25న తీశారు. వారణాసిలో తీశారు నందేసర్ మహల్ నుంచి బలువా ఘాట్ వరకు ఏర్పాటు చేసిన ఊరేగింపు కార్యక్రమంలో ఏనుగుపై మహారాణి సవారీ చేస్తున్నప్పుడు ఈ ఫోటోను తీశారు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ నియోజకవర్గానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక నాలుగో ఫోటోను 1961 ఫిబ్రవరి 24న ట్రాంబేలోని అణు ఇంధన కేంద్రాన్ని సందర్శించినప్పుడు తీశారు.

ఈ ఫోటోలతోపాటు మరికొ్ని అరుదైన బహుమతుల్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బ్రిటన్ మహారాణికి బహుకరించారు. పశ్చిమ బెంగాల్ మకాయ్బరి టీ ఎస్టేట్ లో తయారైన డార్జిలింగ్ టీ ప్యాకెట్లను (ఇక్కడ తయారయ్యే టీ పొడి అవార్డు పొందింది) , జమ్మూ కశ్మీర్ లో తయారైన నాణ్యమైన సేంద్రీయ తేనె, వారణాసి ప్రత్యేకతను చాటే తన్ చోయీ శాలువాలను బహుకరించారు.