Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ‌యోటెక్నాల‌జీ రంగంలో ఇండియా, కోస్టారికా దేశాల‌కు మ‌ధ్య‌న కుదిరిన లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్ ( ఎల్ ఓఐ)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యం లో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది.

బ‌యోటెక్నాల‌జీ విద్య‌, శిక్ష‌ణ మ‌రియు ప‌రిశోధ‌న రంగాల‌లో దృఢ‌మైన వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక రూపొంద‌డానికి వీలుగా శాస్త్ర సాంకేతిక‌రంగ దౌత్యంలో స‌హ‌కారానికి కావ‌ల‌సిన ఎజెండాను త‌యారు చేయ‌డానికిగాను ఈ ఎల్ ఓ ఐ పైన ఇరుదేశాలు సంత‌కాలు చేశాయి.

2019 మార్చి నెల‌లో ఈ ఎల్ఒఐ పైన సంత‌కాలు చేయ‌డం జ‌రిగింది.