Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో వీసా విధానం సరళీకరణ, క్రమబద్దీకరణలకు మంత్రిమండలి ఆమోదం


భారతదేశంలో వీసా విధానం సరళీకరణ, క్రమబద్దీకరణ లతో పాటు ఆ విధానం తక్కువ కాఠిన్యం కలిగివుండేదిగా మార్చడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. సంబంధిత వర్గాలతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపి హోం మంత్రి ఆమోదంతో తుది రూపురేఖలను దిద్దిన వీసా విధానంలో మరిన్ని మార్పులను కూడా మంత్రివర్గం ఆమోదం పొందింది.

ఈ ఆమోదం పర్యటన, వ్యాపారం మరియు వైద్య సంబంధ పనులపై విదేశీయులు దేశంలోకి ప్రవేశానికి సహకరిస్తుంది. అంతేకాక ఆర్థిక పురోగతికి ఉత్తేజాన్ని అందించడంతో పాటు పర్యటన, వైద్య సంబంధ ప్రయాణాలు, వ్యాపార సంబంధ ప్రయాణాలు వంటి సేవల ఎగుమతుల నుండి లభించే ఆదాయం అధికం కావడానికి, ఇంకా ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, తదితర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు విజయవంతం కావడానికి కూడా తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.

ఇది పైన పేర్కొన్న చట్టబద్ధమైన ప్రయోజనాలను పొందేందుకు విదేశీయులు భారతదేశాన్ని సందర్శించడాన్ని సైతం సులభతరం చేయనుంది.