Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం అంతటా ప్రజలు వివిధ పండుగలు జరుపుకొంటున్న సందర్భంగా వారికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారతదేశం అంతటా వివిధ పండుగలు జరుపుకొంటున్న సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.

“భారతదేశ ప్రజలు ఈ రోజు వేరువేరు పండుగలను జరుపుకొంటున్నారు. ఈ మంగళప్రదమైన పండుగల వేళ ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

మకర సంక్రాంతి శుభకామనలు. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవనంలోనూ సంతోషాన్ని, సమృద్ధినీ ప్రసాదించుగాక.

मकर संक्रांति की शुभकामनाएं। इस पावन पर्व पर सभी के जीवन में खुशहाली और संपन्नता आए।

తమిళ మిత్రులకు సంతోషదాయకమైన, ఆశీస్సులతో కూడిన పొంగల్ శుభకామనలు.

என் தமிழ் நண்பர்கள் அனைவருக்கும் மகிழ்ச்சியான மற்றும் ஆசி நிறைந்த பொங்கல் வாழ்த்துகள்

మాఘ్ బిహు ప్రత్యేక సందర్బంలో, అస్సాం ప్రజలకు ఇవే నా శుభాభినందనలు.

মাঘ বিহুৰ এই পৱিত্ৰক্ষণত, অসমবাসীলৈ মোৰ আন্তৰিক শুভেচ্ছা জনাইছো৷

గుజరాత్ ప్రజలకు ఉత్తరాయణ శుభాకాంక్షలు.

આપ સૌને ઉતરાયણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ!

ఇవి, ఇంకా దేశమంతటా జరుపుకొనే అనేక ఇతర పర్వదినాలు మన జీవితాలలో ఆనందాన్ని, గొప్ప వర్ణాలను జోడిస్తాయి. ఈ వివిధత్వం భారతదేశానికి అత్యంత గొప్పదైన బలంగా ఉంటోంది.

ఈ పండుగలు కష్టపడి పనిచేసే మన వ్యవసాయదారుల జీవితాలలో అధిక ప్రసన్నతను, సమృద్ధిని ప్రసాదించుగాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****