పిఎంఇండియా
భారతదేశం- బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం వద్ద బార్డర్ హాట్ (బజారు)లను నెలకొల్పేందుకుగాను సవరించినటువంటి అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) కు మరియు మోడ్ ఆఫ్ ఆపరేషన్ (ఎమ్ఒఒ) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
స్థానిక ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో విక్రయించే సాంప్రదాయక పద్ధతిని ప్రోత్సహించడం ద్వారా- రెండు దేశాల సరిహద్దుల వెంబడి సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల శ్రేయస్సును వృద్ధిపరచాలన్నది బార్డర్ హాట్ ల ధ్యేయం. ఈ చర్యలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల ఆర్ధిక శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.
ప్రస్తుతం మేఘాలయలో రెండు, త్రిపురలో రెండు వెరసి నాలుగు బార్డర్ హాట్ లు పనిచేస్తున్నాయి. 2010 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ నాడు బంగ్లాదేశ్ కు, భారతదేశానికి మధ్య ఎమ్ఒయు, ఎమ్ఒఒ లపై సంతకాలు జరిగాక వీటిని ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2012 మే 15వ తేదీ నాడు బార్డర్ హాట్ లకు సంబంధించి యాడెండమ్ టు మోడ్ ఆఫ్ ఆపరేషన్ పైన సంతకాలయ్యాయి. ఈ సవరించిన ఎమ్ఒయు మరియు మోడ్ ఆఫ్ ఆపరేషన్ లు అదనపు బార్డర్ హాట్ లను నెలకొల్పి, వాటి కార్యకలాపాలను ఆరంభించేందుకు తగిన చట్టబద్దతను కల్పిస్తాయి.