Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మరియు ఇరాన్ ల మధ్య ద్వైపాక్షిక ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


సెక్యూరిటీస్ మార్కెట్ లకు సంబంధించిన విషయాలలో పరస్పర సహకారానికిగాను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ) కి మరియు ఇరాన్ కు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ ఆర్గనైజేషన్ (ఎస్ఇఒ)కు మధ్య ద్వైపాక్షిక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రెండు దేశాల నియంత్రణదారు సంస్థల మధ్య సహకారంతో పాటు ఆర్థిక లింకులు కూడా మరింతగా అభివృద్ధి చెందేటట్లు ఈ ఎమ్ఒయు తోడ్పడే సూచనలు ఉన్నాయి. అంతే కాక, రెండు దేశాల సెక్యూరిటీస్ మార్కెట్ లు సమర్ధంగా పురోగమించేందుకు అనువైన పరిస్థితులను కూడా కల్పించడం ఈ ఎమ్ఒయు ధ్యేయంగా ఉంది. ఉభయ దేశాల మధ్య సమాచారాన్ని పంచుకొనే ఫ్రేమ్ వర్క్ ను పటిష్టపరచడంలోనూ ఇది సహకరించగలుగుతుంది. సెబీ మరియు ఇరాన్ కు చెందిన ఎస్ఇఒ ల నియంత్రణ కార్యకలాపాలు, ఇంకా విదేశాలలో పరస్పరం సహకరించుకొనే తీరుకు మరిన్ని పార్శ్వాలను సైతం జోడిస్తుందని ఆశిస్తున్నారు.

సెబి కి, ఇరాన్ కు చెందిన ఎస్ఇఒ కు మధ్య సమాచారాన్ని పంచుకొనేందుకు ఉన్న ఫ్రేమ్ వర్క్ ను పటిష్టపరచడంలోనూ ఇది సహకరిస్తుందని భావిస్తున్నారు.