పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య హోంలాండ్ సెక్యూరిటీ అంశంపై మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ పై సంతకాలకు ఆమోదం తెలిపింది.
ఈ మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ ఇరు దేశాలకు మధ్య ద్వైపాక్షిక భద్రత సంబంధాలను మరింత పటిష్టపరచగలదు; అంతే కాక, ఉభయ దేశాలకు మధ్య హోంలాండ్ సెక్యూరిటీ డైలాగ్ లో భాగంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినటువంటి ఆరు సబ్-గ్రూపుల నడుమ సమన్వయం ఏర్పరచడంలోను, సమావేశాలు జరిగేటట్లు చూడటంలోను కూడా ఈ మెమొరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ సహాయపడగలదు.