Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మరియు రవాండా ల వైమానిక సేవల ఒ ప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


భారతదేశం మరియు రవాండా ల వైమానిక సేవల ఒ ప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో చోటు చేసుకొంటున్న పరిణామాలకు అనుగుణంగా ఉండడమే కాకుండా భారతదేశం మరియు రవాండా ల మధ్య వ్యాపారం, పెట్టుబడి, పర్యటన రంగాలను మరింత విస్తరింపచేయడంతో పాటు సాంస్కృతిక సంబంధ ఆదాన ప్రదానాలకు కూడా దోహదం చేస్తుంది. ఇరు దేశాల నడుమ ఇతోధికమైన, నిరంతరాయ అనుసంధానానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచగలుగుతుంది. అలాగే, ఉభయ పక్షాలకు చెందిన విమానయాన సేవల కంపెనీలకు వాణిజ్యపరమైన అవకాశాలను ప్రసాదించగలదు. అంతే కాక మరింత భద్రతకు, సురక్షకు కూడా పూచీపడగలదు.