పిఎంఇండియా
భారతదేశం, మొరాకో దేశాల న్యాయవ్యవస్థ ల మధ్య పరస్పర సహకారాన్ని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం మరియు బలోపేతం చేసే అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
ప్రభావం:
భారతదేశం, మొరాకో దేశాల మధ్య న్యాయ మరియు ఇతర న్యాయ రంగాల లో సహకారాన్నిఈ ఆమోదం ప్రోత్సహిస్తుంది. అ౦తే కాకు౦డా, మౌలిక సదుపాయాలు మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం లో జ్ఞాన మార్పిడి ని కూడా అనుమతిస్తుంది.