పిఎంఇండియా
భారతదేశం, స్పెయిన్ ల మధ్య పౌర విమానయాన రంగంలో సహకారం కోసం ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు భారతదేశం, స్పెయిన్ ల మధ్య పౌర విమానయాన రంగ సంబంధాలలో ఒక ప్రధానమైన మహత్తర ఘటనను ప్రతిబింబిస్తుంది. అంతే కాకుండా, ఈ రెండు దేశాల మధ్య మరింత ఎక్కువ వ్యాపారావకాశాలను, పెట్టుబడులను సమకూర్చే, పర్యాటక సంబంధమైన మరియు సాంస్కృతిక సంబంధమైన ఆదాన ప్రదానాలను వర్ధిల్లజేసే సత్తా కూడా ఈ ఎమ్ఒయు కు ఉంది.