Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశానికి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు మధ్య విజ్ఞాన శాస్త్రం ఇంకా సాంకేతిక విజ్ఞాన శాస్త్ర సంబంధ సహకారం అంశం పై ఒప్పందం ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


 

భారతదేశానికి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు మధ్య విజ్ఞాన శాస్త్రం ఇంకా సాంకేతిక విజ్ఞాన శాస్త్ర సంబంధ సహకారం అంశం పై ఒప్పందం ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్రయోజనాలు:

ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల లో ఒక నూతన అధ్యాయాని కి నాంది పలుకుతుంది.  ఇరు పక్షాలు విజ్ఞాన శాస్త్రం ఇంకా సాంకేతిక విజ్ఞాన శాస్త్ర రంగాల లో వాటి వాటి శక్తి యుక్తుల ను పరస్పర మేళనం తో పూరకం వలె ఉపయోగించుకొంటాయి. 

ఈ ఒప్పందం ఉన్నత స్థాయి నాణ్యత ను కలిగిన,  అధిక ప్రభావవంతమైన పరిశోధన తాలూకు భాగస్వామ్యాల ను మరియు నూతన ఆవిష్కరణ పరమైనటువంటి భాగస్వామ్యాల ను ప్రోత్సహించుకొనేందుకు అవకాశాన్ని కల్పించడం తో పాటు విజ్ఞాన శాస్త్ర సముదాయాలు మరియు సాంకేతిక విజ్ఞాన శాస్త్ర సముదాయాల నడుమ గల సంబంధాల ను విస్తృతం చేయడంలోనూ తోడ్పడుతుంది. 

ప్రధాన అంశాలు:

విజ్ఞాన శాస్త్ర పరమైన సమాచారం మరియు సాంకేతిక విజ్ఞాన శాస్త్రపరమైన సమాచారాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం వెల్లడి చేసుకోవడం, ఆయా నిపుణుల రాక పోకల కు ఆస్కారం.
చర్చాసభ లు మరియు సమావేశాలను నిర్వహించడం.
శాస్త్రవేత్తల కు మరియు సాంకేతిక విజ్ఞాన నిపుణుల కు శిక్షణ ను ఇవ్వడం.
సహకార ప్రాతిపదిక న పరిశోధన ప్రోజెక్టుల నిర్వహణ.
విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి మరియు నూతన ఆవిష్కరణల పరమైనటువంటి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల ను ఏర్పాటు చేయడం.
అధునాతన పరిశోధక సదుపాయాల ను వినియోగించుకోవడం.