పిఎంఇండియా
భారతదేశానికి, మొజాంబిక్ కు మధ్య డ్రగ్ డిమాండ్ గిరాకీ తగ్గింపు, ఇంకా మాదక ద్రవ్యాలు, సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్, ప్రికర్సర్ కెమికల్స్ మరియు సంబంధిత పదార్థాల నిరోధానికి సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ అవగాహనపూర్వక ఒప్పందం మత్తుమందులు, సైకోట్రాపిక్ సబ్ స్టెన్సెస్ మరియు ప్రికర్సర్ కెమికల్స్ అక్రమ రవాణాపై పోరాటం సాగించేందుకు రెండు దేశాలూ వాటి వద్ద ఉన్న సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, సామర్థ్య నిర్మాణాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా కృషి చేయడానికి ఉద్దేశించినటువంటిది.