పిఎంఇండియా
భారతదేశానికి, సెర్బియా కు మధ్య 2003 జనవరి 31 న సంతకాలు జరిగి, ప్రస్తుతం అమలులో ఉన్న విమాన సేవల ఒప్పందాన్ని (ఎఎస్ ఎ) నవీకరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పౌర విమానయాన రంగంలో వచ్చిన తాజా మార్పులకు అనుగుణంగా , అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) తాజా నియమాలు, రెండు దేశాల మధ్య విమాన సేవలను మరింత మెరుగుపరచుకొనే దృష్టితో ఈ ఒప్పందం నవీకరణ జరగనుంది.
2. విమాన సేవల నూతన ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
(i) జాతీయ పౌర విమానయాన విధానానికి అనుగుణంగా సెర్బియాతో ఓపెన్ స్కై విధానాన్ని ఖరారు చేశారు. దీనితో ఇండియాకు చెందిన విమానయాన సంస్థలు ఇండియా లోని ఏ ప్రొంతం నుండి అయినా సెర్బియా లోని ఏ ప్రాంతానికైనా సర్వీసులను నడపవచ్చు. సెర్బియా విమానయాన సంస్థలు న్యూ ఢిల్లి, ముంబయి లతో పాటు తరువాత ప్రకటించే రెండు మెట్రో నగరాలకు నేరుగా తమ విమాన సర్వీసులను నడపవచ్చు. దీనికి తోడు రెండు దేశాల విమానయాన సంస్థలు ఆయా నిర్దేశిత ప్రాంతాల మధ్య లేదా అవతలి ప్రాంతాలకు విమాన సేవలను అందించే రూటింగ్ వెసులుబాటు కూడా ఉంటుంది.
(ii) నిర్దేశిత విమానయాన సంస్థ ఇతర దేశాల భూభాగంలోని రూట్ షెడ్యూలులో ప్రకటించిన పాయింట్లకు మించి ఏవైనా నాలుగు అదనపు పాయింట్లకు డొమెస్టిక్ కోడ్ షేర్ కార్యకలాపాలను నిర్వహించుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ నాలుగు పాయింట్లను ఎప్పుడైనా నిర్దేశించవచ్చు.
(iii) ఇరు పార్టీలకు చెందిన నిర్దేశిత ఎయిర్‌లైన్ సంస్థలు అదే దేశానికి చెందిన లేదా ఒప్పందం లోని రెండో పక్షంతో లేదా మూడో దేశంతో సహకార మార్కెటింగ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
(iv) ఇది నేరుగా విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, మూడో దేశపు విమానయాన సంస్థల నుండి కూడా కనెక్టివిటి లభిస్తుంది. ఇది ఇండియన్ కారియర్లకు సానుకూలంగా ఉండగలదు.
(v) రెండు దేశాలూ ఒక ఎయిర్ లైన్ ను లేదా అంతకంటె ఎక్కువ ఎయిర్‌లైన్‌లను ప్రతిపాదించవచ్చు. ఇంతకు ముందు ఒప్పందంలో ఇరు దేశాలు తమ వైపు నుండి గరిష్ఠంగా రెండు విమానయాన సంస్థలను మాత్రమే ప్రతిపాదించాల్సి ఉండేది.
భారతదేశం, సెర్బియా ల మధ్య కొత్తగా నవీకరించిన, సరళీకృత విమానయాన సేవల ఒప్పందం పౌర విమానయాన రంగంలో వచ్చిన తాజా మార్పులకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి రంగాలలో మరింత పురోగతికి అవకాశాలు కల్పించనుంది. ఈ ఒప్పందం ఇరు దేశాల విమానయాన సంస్థలకు వాణిజ్య అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ ప్రాంతాలకు నిరంతరాయ , మరింత మెరుగైన రక్షణతో కూడిన, మరింగ మెరుగైన భద్రతతో కూడిన విమాన సేవలను అందడానికి దోహదపడుతుంది.
ఇప్పటివరకు రెండు దేశాల మధ్య కనెక్టివిటి లేదు. సవరించిన ఒప్పందం రెండు దేశాల మధ్య విమాన సేవల అనుసంధానతకు వీలు కల్పించనుంది.