Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయులు తమ కలలను సాకారం చేసుకోవడంలో విస్తృత అవకాశాలు ఎలా తోడ్పడుతున్నాయో తెలిపే వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని


భారత్‌లోని కొత్త తరం తన కలలను సాకారం చేసుకొనేలా గత పన్నెండేళ్లలో అవకాశాలు, మార్గాలు ఎలా విస్తరించాయో తెలియజేస్తూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.  

భారత్‌లో ప్రతిభకు ఎన్నడూ కొదవ లేదని, భారతీయులు పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకొనే వీలును విస్తరిస్తున్న అవకాశాలు అందిస్తున్నాయని ఈ వ్యాసం తెలిపిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

భారత్‌లో ప్రతిభకు కొదవ లేదు. కానీ తరచూ ఆ కలలను నెరవేర్చుకోవడంలో కొరవడినవి అవకాశాలు, మార్గాలే.

గడచిన పన్నెండేళ్లు ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పును తీసుకువచ్చాయో, కొత్త తరం కలలు కనడం మాత్రమే కాకుండా వాటిని సాకారం చేసుకొనే వీలును ఎలా కల్పించాయో పీవీ సింధు తన కథనంలో వివరించారు.’’

 

***