పిఎంఇండియా
ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు, గౌరవనీయులు శ్రీ రాబర్ట్ ముగాబే, ఆఫ్రికా యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు మేడమ్ ద్లామినీ జుమా, గౌరవనీయులు, పెద్దలారా!
ఆఫ్రికాకు చెందిన 54 సార్వభౌమాధికార దేశాల పతాకాలతో కూడిన ఈ ప్రపంచం చాలా సుసంపన్నమైనది. ఆ పతాకాల ధగధగలు నేడు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ప్రదేశంగా నిలబెట్టాయి.
ఆఫ్రికా నుంచి వచ్చిన 41 దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, ఇతర ప్రముఖ నాయకులు, వందలాది సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలు, పాత్రికేయులందరికీ స్వాగతం. మొట్టమొదట నేను ఒ కే ఒ క్క మాట చెప్పదలచుకున్నాను. మీ అందరి రాకను మేం ఎంతో గౌరవంగా భావిసున్నాం.
చరిత్ర మొదలైన చోటు నుంచి, మానవత్వం పరిఢవిల్లిన ప్రదేశం నుంచి, కొత్త ఆ శలు కొలువుదీరిన ఖండం నుంచి వచ్చిన ప్రముఖులారా!
మారుతున్న కాలానికి అనుగుణంగా, మానవ నాగరికతా ప్రాభవం ప్రకాశించిన ఉత్తర ప్రాంత ఎడారుల నుంచి…
మహాత్మాగాంధీ మొదలుకొని అల్బర్ట్ లుథిలి దాకా నెల్సన్ మండేలా దాకా, మన యుగపు విచక్షణ స్ఫూర్తి వి కసించిన దక్షిణ దేశాల నుంచి…
ఒ కప్పుడు చారిత్రక వి షాదాల కూడలిగా, నేడు విజయ శంఖారావాలు వినిపించే నేలగా ఉన్న అట్లాంటిక్ మహా సముద్ర తీరాల నుంచి..
పునరుజ్జీవిత తూర్పు తీరంలో ఉన్న మా పొరుగు దేశాల నుంచి…
ప్రాకృతిక స్వచ్ఛత, సాంస్కృతిక సుసంపన్నత కలిగిన ఆఫ్రికా కేంద్ర స్థానం నుంచి…
మణి మయ కాంతులు వెదజల్లే ద్వీప దేశాల నుంచి…
వచ్చిన అందరికీ భారత్ తరఫున హృదయపూర్వక, స్నేహపూర్వక స్వాగతం. నేడు ఇది కేవలం భారత్- ఆఫ్రికాల సమావేశం కాదు. ప్రపంచంలోని మూడో వంతు మానవ జనాభా ఆ శలు, ఆ కాంక్షలు నేడు ఒ కే చోట కొలువుదీరాయి. 125 కోట్ల మంది భారతీయుల, 125 కోట్ల మంది ఆఫ్రికా వాసుల హృదయ స్పందనలు నేడు ఒ కే ల యలో వినిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే మనవి అత్యంత పురాతన నాగరికతలు. మనలో ప్రతి ఒ క్కరికీ ఒ క్కొక్క వైవిధ్య భరితమైన భాష, మతం, సంస్కృతి ఉన్నాయి.
మన చరిత్రలు యుగాల తరబడి కలిసే ఉన్నాయి. ఒ కప్పుడు భౌగోళికంగా కలసి ఉన్న మనం, ఇప్పుడు హిందూ మహా సముద్రంతో కలపబడి ఉన్నాం. ఆ మహా సముద్ర పటిష్ఠ కెరటాల శక్తి శతాబ్దాలుగా మన మధ్య రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక బంధాన్ని దృఢతరం చేస్తోంది.
తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ అ యితేనేమి, పరిస్థితుల ప్రాబల్యం వల్ల అ యితేనేమి, భారతీయులు, ఆఫ్రికన్లు తరాల తరబడి ఒ కరి నేలకు మరొకరు ప్రయాణించారు. ఏదో రకంగా ఒ కరిని ఒ కరు సుసంపన్నం చేశారు. సంబంధాలను బలోపేత పరిచారు.
మనమంతా సుదీర్ఘమైన సామ్రాజ్య వాదపు ఛాయలో నివసించాం. మన స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం పోరాడాం. మానవత్వానికి అత్యంత ప్రధానమైనదిగా ఆఫ్రికా సంస్కృతి నిర్వచించే అ వకాశాల కోసం, న్యాయం కోసం మనం పాటుపడ్డాం.
ప్రపంచంలో మనమంతా ఒ కే గొంతుకతో మాట్లాడాం. మన ప్రజల సౌభాగ్యం కోసం భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాం.
శాంతి పరిరక్షణ కోసం మనం నీలి హెల్మెట్లు ధరించి కలసికట్టుగా నిలబడ్డాం. ఆ కలికి, వ్యాధులకు వ్యతిరేకంగా ఉ మ్మడిగా పోరాటం జరిపాం.
ఇప్పుడు మనం మన భవిత కోసం చూస్తున్నాం. ఇప్పుడు మనను ఏ కం చేస్తున్న విలువైన విషయం ఒ కటుంది. అదే మన యువత!
భారత్ లోని, ఆఫ్రికాలోని మూడింట రెండు వంతుల జనాభా 35 ఏళ్ల లో పువారే. భవిష్యత్తు కాలమంతా యువతకే చెందుతుంది అనుకుంటే, ఈ శతాబ్దాన్ని పునరావిష్కరించేది, పునర్నిర్మించేది మనమే!
గౌరవనీయులారా.. ఆఫ్రికా ఇప్పుడు అదే మార్గంలో ఉంది.
పురాతన కాలంలో ఆఫ్రికా సాధించిన ఘనతల గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని అధునాతన అద్భుతాలు, ఆ విష్కరణలు ప్రపంచం దృష్టిని ఆ కర్షిస్తున్నాయి.
ఆఫ్రికా ఖండం ఇప్పుడు మరింత సుస్థిరంగా ఉంది. అభివృద్ధి, శాంతి భద్రతల వంటి బాధ్యతలను స్వీకరించడానికి ఆఫ్రికా దేశాలు ఇప్పుడు కలసికట్టుగా ముందుకు వస్తున్నాయి.
ఆఫ్రికా దేశాలు చేస్తున్న పోరాటాలు, త్యాగాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. ఉగ్రవాదంతో తలపడుతున్నాయి. మహిళలను శక్తిమంతులుగా తీర్చిదిద్దుతున్నాయి.
ఆఫ్రికా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుల్లో నేడు 20 శాతం మంది మహిళలు ఉన్నారు.
ఈ ఘనత సాధించడంలో ఒ కరైన అధ్యక్షురాలు శ్రీమతి సర్‌లీఫ్‌కు, నేడు ఆమె జన్మదినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆఫ్రికా ఆర్థిక ప్రగతి నేడు మరింత వేగవంతమైంది. మరింత వైవిధ్యభరితమైన పునాదిపై అది నిలబడింది. ఆఫ్రికా దేశాలు చూపుతున్న సరికొత్త చొరవ వల్ల ఏర్పడుతున్న ప్రాంతీయ ఆర్థిక సమగ్రత అనే కొత్త వంతెనలు పాత అగాథాలను పూడ్చివేస్తున్నాయి.
ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సహజ వనరుల సదుపయోగం వంటి విషయాల్లో మనం ఎన్నో సఫల ఉదాహరణల్ని చూసున్నాం. దుర్బల ఆర్థిక వ్యవస్థల నుంచి ఇప్పుడు అవి చైతన్య భరితమైన ఆర్థిక వ్యవస్థలుగా మారుతున్నాయి.
2013లో ఆఫ్రికాలో నాలుగు లక్షల కొత్త వ్యాపారాలు నమోదయ్యాయి. నేడు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 95 శాతం జనాభాకు మొబైల్ ఫోన్ సౌకర్యం సమకూరింది.
సరికొత్త ఆ విష్కరణల్లో ఆఫ్రికా ఇప్పుడు ప్రపంచ ప్రధాన స్రవంతిలోకి చేరుతోంది. మొబైల్ బ్యాంకింగ్… ఎం పెసా, ఆ రోగ్య ఆ విష్కరణ.. మెడ్ ఆఫ్రికా, వ్యావసాయిక వినూత్నత.. అగ్రి మేనేజర్, కిలిమో సలమా వంటివి ఇప్పుడు ఆఫ్రికా వాసుల జీవన నాణ్యతను పెంచడానికి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నాయి.
ఆ రోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మక మెరుగుదల దిశగా బలమైన చర్యలు చేపట్టడాన్ని మనం చూస్తున్నాం. ఆఫ్రికాలోని ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు నేడు 90 శాతాన్ని దాటింది.
అత్యంత అద్భుతమైన భూభాగాలను కలిగిన ఆఫ్రికా వన్యప్రాణి పరిరక్షణలో, పర్యావరణ పర్యాటకంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది.
ఆఫ్రికా క్రీడలు, కళలు, సంగీతం మొత్తం ప్రపంచాన్ని ఎంతో అలరించాయి.
నిజమే.. ఆఫ్రికా కూడా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల మాదిరే అభివృద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మిగతా దేశాల మాదిరే భద్రత, స్థిరత్వ సవాళ్లు దానికీ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉగ్రవాదం, తీవ్రవాదం సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఆఫ్రికా నాయకత్వంపై నాకు విశ్వాసముంది.. ఈ సవాళ్లను ఆఫ్రికా సంపూర్ణంగా అధిగమించలగలదని!
గౌరవనీయ సదస్యులారా!
గత ఆరు దశాబ్దాలుగా స్వతంత్రంగా సాగుతున్న మన ప్రయాణాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పుడు భారతదేశ అభివృద్ధి ప్రాథమ్యాలు, ఆఫ్రికా దేశాల సమున్నతమైన భవిష్యత్ దార్శనికత ఒకే రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం అవకాశాలు, ఆశావహ పరిస్థితుల పరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆఫ్రికా, భారత్‌లు రెండూ ప్రభావవంతమైన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఆఫ్రికా అభివృద్ధి భాగస్వామిగా భారత్ గౌరవాన్ని దక్కించుకుంది. వ్యూహాత్మక అంశాలు, ఆర్థిక ప్రయోజనాల కంటే మన భాగస్వామ్యం మరెంతో సమున్నతమైనది. ఇరువురికీ ఒకరిపట్ల ఒకరికి గల సంఘీభావం, ఉద్విగ్నభరితమైన అనుబంధం నుంచి మన పటిష్ఠ భాగస్వామ్యం ఏర్పడింది.
కేవలం ఒక్క దశాబ్దంలోపే మన వాణిజ్యం రెట్టింపైంది. 70 బిలియన్ డాలర్లు దాటింది. ఆఫ్రికాలో వాణిజ్య పెట్టుబడులకు భారత్ ప్రస్తుతం ప్రధాన వనరుగా మారింది. ఈ రోజు 34 ఆఫ్రికా దేశాలు భారతీయ మార్కెట్‌లోకి ఎలాంటి సుంకాలు లేని ప్రవేశానికి అనుమతి పొంది ఉన్నాయి.
భారతీయ ఆర్థిక వ్యవస్థ అనే ఇంజిన్ నడవడానికి ఆఫ్రికా ఎనర్జీ దోహదం చేస్తోంది. మా పరిశ్రమలకు ఆఫ్రికా వనరులు కావాల్సిన శక్తిని అందిస్తున్నాయి. ఆఫ్రికా అభివృద్ధి భారతీయ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌ను అందిస్తోంది.
2008లో జరిగిన తొలి భారత్-ఆఫ్రికా సదస్సు నాటి నుంచి మీ వెంట నడిచేందుకు కట్టుబడి ఉన్నాం. 7.4 బిలియన్ డాలర్ల చౌక రుణం ఇచ్చేందుకు, 1.2 బిలియన్ డాలర్ల గ్రాంటు ఇచ్చేందుకు భారత్ కట్టుబడి ఉంది. అలాగే సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా 100 ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఆఫ్రికావ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధి, ప్రజా రవాణా, క్లీన్ ఎనర్జీ, సాగునీటి వసతులు, వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్ వృద్ధికి సహకరిస్తున్నాం.
గత మూడేళ్లలోనే 25 వేల మంది యువ ఆఫ్రికన్లకు భారత్‌లో ప్రత్యేక శిక్షణ, విద్యను అందించాం. ఆ 25 వేల మందీ భారత్-ఆఫ్రికా మధ్య సరికొత్త సంధానకర్తలుగా నిలుస్తారు.
గౌరవనీయ సదస్యులారా!
కొన్ని సందర్భాల్లో మీరు ఆకాంక్షినంత స్థాయిలో మేం పనులు చేసి ఉండలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మేం ఉండాల్సిన స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఉండకపోవచ్చు. కొన్ని వాగ్దానాలను చేయాల్సినంత వేగంగా మేం నెరవేర్చి ఉండకపోవచ్చు. కానీ ఎలాంటి బేరీజులు లేకుండా మీరు భారత్‌ను సౌహ్రార్దంగా చూశారు. మన ఉమ్మడి విజయాల్లో పాలుపంచుకున్నారు. ఆ విజయాలను సగర్వంగా స్వీకరించారు. మనం ఒక్కటిగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి చాటారు. మన భాగస్వామ్యం, స్నేహంలోని బలానికి ఇదో నిదర్శనం.
మన అనుభవ సారం, మీరు అందించే మార్గదర్శకత్వం ఆధారంగా మనం భవిష్యత్ పయనాన్ని సాగిద్దాం. ఐక్య ఆఫ్రికాను సమీకృతంగా అభివృద్ధిపరచి, ప్రపంచ ప్రధాన భాగస్వామిగా నిలపాలన్న మీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు మేం మా మద్దతు అందిస్తాం.
కైరో నుంచి కేప్ టౌన్ వరకు, మారకేష్ నుంచి మొంబస్సా వరకు ఆఫ్రికాను అనుసంధానించేందుకు, మీ దగ్గర మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి వసతుల అభివృద్ధికి సహకరిస్తాం. ఆఫ్రికాలోని వనరులకు మరింత విలువను జోడించేందుకు తోడ్పడతాం. పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేస్తాం.
గౌరవనీయ సదస్యులారా!
సమగ్ర అభివృద్ధిలో మానవ వనరులు అత్యంత విలువైన ప్రాథమిక ఆస్తి అని నైజీరియాకు చెందిన ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ వోల్ సోయింకా నొక్కి చెప్పారు. ఆ విలువైన మాటల బాటే మనకు మార్గదర్శకం. మానవాభివృద్ధికి తోడ్పడే సంస్థల అభివృద్ధే ఉత్తమమైన భాగస్వామ్యానికి కీలకం. ఆ సంస్థలు ఒక దేశం తనదైన పంథాలో ముందుకు సాగేందుకు తోడ్పడేలా, స్వీయ అభివృద్ధి బాధ్యతను భుజానికి ఎత్తుకోగలిగేలా తోడ్పడాలి. అలాగే యువతకు అవకాశాల ద్వారాలను తెరవగలగాలి.
ప్రతి రంగంలోనూ మానవాభివృద్ధికి తోడ్పాటు అనేది మన భాగస్వామ్యంలో కీలక అంశంగా నిలవాలి. ఈ దిశలో మీ కోసం మా ద్వారాలను మరింతగా తెరిచి పెడతాం. టెలీ-ఎడ్యుకేషన్ అవకాశాలను మరింత విస్తృతపరుస్తాం. ఆఫ్రికాలో సంస్థల ఏర్పాటును కొనసాగిస్తాం.
“సైన్స్ తన ఐడియాల కాంతితో ప్రజలను ఒక్క దగ్గరికి చేరుస్తుంది. ఉత్తమ భవిష్యత్తు దిశగా మనల్ని నడిపిస్తుంది” అని అన్నారు ఈజిప్టుకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ రచయిత శ్రీ నగీబ్ మహ్‌ఫౌజ్. ప్రజలను ఒక్కటి చేసి, పురోగమనం వైపు నడిపించే విషయంలో సైన్స్ గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి వ్యక్తీకరణ ఉండదు. అందుకే మన భాగస్వామ్యానికి టెక్నాలజీయే పటిష్ఠమైన పునాది. ఆఫ్రికా వ్యవసాయ రంగం అభివృద్ధికి అది ఎంతగానో తోడ్పడుతుంది. ప్రపంచంలో సాగు యోగ్యమైన భూముల్లో 60 శాతం ఆఫ్రికాలో ఉన్నాయి. కానీ ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో 10 శాతం మాత్రమే ఆఫ్రికా నుంచి వస్తోంది. ఉపఖండం పురోగతి, ప్రపంచ ఆహార భద్రత విషయంలో కీలక భూమిక పోషించగల సత్తా ఆఫ్రికా వ్యవసాయ రంగానికి ఉంది.
ఆరోగ్య రంగంలో భారత్‌కు ఉన్న నైపుణ్యం, అందుబాటు ధరల్లో దొరికే మందులు, పలు వ్యాధులపై జరిగే పోరులో విజయం సాధించే దిశగా ఎంతో ఉపకరించగలవు. నవజాత శిశువులు బాలారిష్టాలను దాటి జీవించగలిగేలా చేయగలవు. భారత్, ఆఫ్రికాల్లోని సాంప్రదాయ విజ్ఞానం, ఔషధాల అభివృద్ధికి మీతో కలిసి పనిచేస్తాం.
మా అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతాం. అభివృద్ధి, పౌర సేవలు, సుపరిపాలన, విపత్తు సహాయం, వనరుల నిర్వహణ, జీవన నాణ్యత వంటి వాటి పెంపునకు డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం. ఆఫ్రికాలోని 48 దేశాలను భారత్‌తో అనుసంధానం చేసేలా దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆఫ్రికా వ్యాప్తంగా రూపొందించిన ఇ-నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తాం. ఇది పాన్ ఆఫ్రికా వర్చువల్ యూనివర్సిటీ ఏర్పాటుకు దోహదం చేస్తుంది.
ఆఫ్రికాలోని పలు దేశాల మధ్య.. ఆఫ్రికా దేశాలకు, మిగతా ప్రపంచానికి నడుమ ఏర్పడిన డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు కృషి చేస్తాం. మన సంపదకు భవిష్యత్తులో ముఖ్య చోదకాలైన నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కొనసాగడానికి సహకరిస్తాం. నాకు సంబంధించి, స్వచ్ఛ అభివృద్ధి బాటలో మనం పయనిస్తున్నాం కనక.. నీలి ఆకాశాన్ని, నీలి జలాలను పునరుద్ధరించడానికి విస్తృత నీలి విప్లవంలో నీలి ఆర్థిక వ్యవస్థ కూడా ఒక భాగమని విశ్వసిస్తున్నాను.
గౌరవ సదస్యులారా..
సూర్యాస్తమయం అవుతూనే, భారత్‌లోనూ ఆప్రికాలోనూ లక్షలాది ఇళ్లలో చీకట్లు అలముకుంటాయి. మన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి భవిష్యత్తును కాంతిమంతం చేయాలని మేం భావిస్తున్నాం. కానీ, కిలిమంజారోపై మంచు మాయం కాకుండా, పవిత్ర గంగానదిని పరిపుష్టం చేసే గ్లేసియర్ కనుమరుగు కాకుండా.. ఇంకా, మన ద్వీపాల్లో చీకట్లు అలముకోకుండా వీటిని చేయాలని మేం భావిస్తున్నాం. భూతాపాన్ని తగ్గించడానికి భారత్, ఆఫ్రికా కంటే ఎవరూ తక్కువ చేయలేదు. వాతావరణ మార్పులకు సంబంధించి భారతీయులు, ఆఫ్రికన్ల కంటే ఎవరూ ఎక్కువ వివేకవంతంగా కూడా వ్యవహరించలేదు. ఎందుకంటే, ప్రకృతికి సంబంధించిన అత్యంత విలువైన బహుమతులకు వారసులం మనమే. ఇక సంప్రదాయాలను ఎక్కువగా గౌరవించేది కూడా మనమే. ఇంకా చెప్పాలంటే మన జీవితాలు పూర్తిగా భూమాతతో అనుసంధానమై ఉంటాయి.
మనలో ప్రతి ఒక్కరమూ మనకున్న పరిమితమైన వనరులతోనే వాతావరణ మార్పులతో పోరాడడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. భారత్ కు సంబంధించి, 2022 నాటికి 175 గిగావాట్ల అదనపు సంప్రదాయేతర విద్యుత్తును ఉత్పత్తి చేయడం, 2030 నాటికి కాలుష్యాల తీవ్రతను 33-35 శాతానికి తగ్గించడం అనేవి మా ప్రయత్నాల్లో రెండు పార్వ్శాలు మాత్రమే.
స్వచ్ఛ ఇంధనం, ఆవాసయోగ్యమైన నివాస స్థలం, ప్రజా రవాణా మరియు వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయంపై భారత్ – ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం.
కానీ, కొద్ది మందికి ఎక్కువైనది అత్యధికులకు భారంగా మారరాదన్నది వాస్తవం. అందుకే, డిసెంబరులో పారిస్‌లో ప్రపంచ నేతలంతా సమావేశం అవుతున్నప్పుడు.. ‘పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి సదస్సు’లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సమగ్ర, సంపూర్ణ ఫలితాలను మేం చూడాలని అనుకుంటున్నాం. అందుకు మనమంతా మన వంతు సాయం చేద్దాం. అయితే, శుద్ధ ఇంధనాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు; దానిని అందిపుచ్చుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు, సాంకేతికత అందించేందుకు; వాతావరణ మార్పుల ప్రభావాన్ని అనుకూలంగా మార్చుకునే వనరులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యం కూడా చిత్తశుద్ధితో ఉండాలని మేం కోరుకుంటున్నాం.
నవంబర్ 30వ తేదీన పారిస్ లో జరిగే కాప్ 21 సమావేశంలో నేను సౌరశక్తి సమృద్ధ దేశాల కూటమిని ప్రతిపాదించబోతున్నాను. అందులో చేరడానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. సౌర శక్తిని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడంతోపాటు ఏమాత్రం దారీతెన్నూ లేని గ్రామాలు, ప్రజలకు దానిని చేరువ చేయడమే మా లక్ష్యం.
మన వ్యాపార ప్రయోజనాలను మెరుగు పరిచే, అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేసే గ్లోబల్ ట్రేడింగ్ విధానాన్ని కూడా భారత్ మరియు ఆఫ్రికాలు కోరుకుంటున్నాయి. డిసెంబరులో డబ్ల్యూటీవోకు సంబంధించిన నైరోబీ మినిస్టీరియల్‌లో మనం సమావేశమైనప్పుడు.. ఈ మౌలిక లక్ష్యాలను సాధించకుండా 2001నాటి దోహా డెవలప్‌మెంట్ ఎజెండాను మూసివేయకుండా మనం చూడాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి వ్యవసాయంలో ప్రత్యేక రక్షణ విధానం, ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వ నిల్వలపై శాశ్వత పరిష్కారాన్ని కూడా మనం కనుగొనాల్సి ఉంటుంది.
గౌరవ సదస్యులారా..
ఐక్య రాజ్య సమితి 70వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా మన భవిష్యత్తుకు ఎజెండాను నిర్దేశించుకుంటున్న తరుణంలో ఈ ఏడాది ఒక మైలు రాయి వంటిది. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రపంచం రాజకీయంగా, ఆర్థికంగా, సాంకేతికంగా మరియు భద్రతా పరంగా తీవ్రమైన మార్పులకు లోనవుతోంది. అయినా మన ప్రపంచవ్యాప్త సంస్థలన్నీ మనం వదిలిపెట్టి వచ్చేసిన పరిస్థితులనే ప్రతిఫలిస్తున్నాయి తప్పితే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను ప్రతిబింబించడం లేదు.
ఈ సంస్థలన్నీ మనకు ఎంతో చక్కగా సేవలందించాయి. కానీ, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అవి మారకపోతే మాత్రం, అవి మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో వాటి స్థానాన్ని ఏ సంస్థలు భర్తీ చేస్తాయన్న విషయాన్ని కూడా మనం చెప్పలేము. కానీ, మన హయాంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు తక్కువ సామర్థ్యం కలిగిన ముక్కలు ముక్కలుగా ఉన్న ప్రపంచం మనకు ఉండి ఉండవచ్చు. అందుకే, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలకు భారత్ మద్దతు ఇస్తోంది.
స్వేచ్ఛాయుత దేశాలు మరియు మేలుకొన్న ఆకాంక్షల శకమిది. ప్రపంచంలో ఆరోవంతు జనాభా ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్యమే కాకుండా ఐక్య రాజ్య సమితి సభ్యుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది సభ్యులున్న ఆఫ్రికాకు అది మద్దతు ఇవ్వకపోతే మన సంస్థలు మన ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించనట్లే లెక్క. అందుకే, భద్రతా మండలి సహా ఐక్య రాజ్య సమితిలో సంస్కరణలు తీసుకు రావాలని భారత్, ఆఫ్రికాలు ముక్త కంఠంతో నినదించాలి.
గౌరవ సదస్యులారా..
ఈరోజు.. భవ్యమైన భవిష్యత్తుకు సంబంధించిన కాంతి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో హింస మరియు అస్థిరత మధ్య మినుకుమినుకుమంటోంది. ఆఫ్రికాలోని వీధులు, బీచ్‌లు, పాఠశాలలు, మాల్స్‌లో ఉగ్రవాదం ఎంతోమంది జీవితాలను బలి తీసుకుంటుంటే అదంతా మాకు కలిగిన బాధగా మేం బాధ పడుతున్నాం. ఈ ముప్పు నుంచి మనను ఏకం చేసే సంబంధ బాంధవ్యాల కోసం మేం ఎదురు చూస్తున్నాం. అంతేనా.. వ్యాపారానికి మన సముద్రాలు సురక్షితంగా లేకపోతే మనమంతా ఇబ్బందులు పడతామని కూడా మేం భావిస్తున్నాం.
దేశాలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఎవరూ అంటరానివారిగా ఉండిపోరు. అంతేకాక సైబర్ నెట్‌వర్కులు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అవి పెను సవాళ్లనుకూడా వెంటపెట్టుకొస్తున్నాయి. అందువల్ల భద్రత విషయానికి వచ్చినప్పుడు మనమధ్య ఉన్న దూరం ఒకరినుంచి మరొకరికి ఎంతో కాలం అవరోధాలు కల్పించలేదు. అందువల్లే సముద్ర తీర రక్షణ, భూజలాధ్యాయానికి సంబంధించి మన మధ్య బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నాం. అందువల్లే అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్య రాజ్యసమితికి సమగ్ర ఒడంబడిక ఉండాల్సిన అవసరం ఉంది.
ఆఫ్రికా యూనియన్ చేపట్టే శాంతి పరిరక్షక కార్యక్రమాలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. శాంతిని పరిరక్షించేందుకు కృషి చేసే ఆఫ్రికన్లకు భారత్‌లోనూ, ఆఫ్రికాలోనూ శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.దీంతోపాటు ఐక్యరాజ్యసమితి చేపట్టే శాంతిపరిరక్షక కార్యక్రమాలను నిర్ణయించడంలోనూ మన గళాన్ని బలంగా వినిపించాల్సి ఉంది.
గౌరవనీయులైన సదస్యులారా
జీవితాలను అనుసంధానించడం ద్వారా సమృద్ధి సాధించడానికి మనం సహకరించుకోవాలి. మన ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ప్రపంచ లక్ష్యాలవైపు సాగాలి. ఉమ్మడి ఆకాంక్షల పరిధికి అనుగుణంగా మన భాగస్వామ్య ఎజెండా ముందుకు వెళ్లాలి.
మన మధ్య బంధం మరింత బలపడేందుకు వచ్చే ఐదేళ్లలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు రుణాన్నిభారత్ అందజేస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రుణ సదుపాయానికి ఇది అదనం. ఇదేగాక సహాయక గ్రాంటుగా 60 కోట్ల అమెరికన్ డాలర్లను కూడా అందజేస్తాం.దీనిలో భాగంగానే ఇండియా ఆఫ్రికా అభివృద్ధి నిధికింద పది కోట్ల అమెరికన్ డాలర్లు, ఇండియా-ఆఫ్రికా ఆరోగ్య నిధి కింది కోటి అమెరికన్ డాలర్లు అందజేస్తాం. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 50 వేల స్కాలర్‌షిప్పులు కూడా ఇందులో భాగంగానే అందజేస్తాం. పాన్ ఆఫ్రికా ఇ- నెట్‌వర్క్, నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలను ఆఫ్రికా అంతటా ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాం.
గౌరవనీయులైన సదస్యులారా,
సరైన అవకాశాలున్న జీవితాలను, సమానత్వాన్ని, గౌరవాన్ని కలిగి ఉండేలా ఈ శతాబ్దం గుర్తింపు పొందితే.. ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలగడం, ప్రకృతితో సమతుల్యం సాధించేలా ఇండియా ఆఫ్రికాలు కచ్చితంగా కలిసి అభివృద్ధి సాధించాలి.
మనం కలిసి పనిచేద్దాం;మనం ఎదుర్కొన్న ఒకే రకమైన కష్టాలనుంచి మరియు మనకున్న ఒకే రకమైన ఆకాంక్షలు;మన వారసత్వ గొప్పదనం మరియు ప్రపంచం పట్ల ఉన్న నిబద్ధత; మన ప్రజలు చేసిన ప్రతిజ్ఞనుంచి మరియు మన భవిష్యత్తుపై నమ్మకంతో కలిసి పని చేద్దాం.
ఒక చిన్న ఇల్లు వందమంది స్నేహితులను కలిపి ఉంచుతుందన్న ఆఫ్రికా సామెత ఔదార్యం నుంచి, గొప్ప మనసులు ఎల్లప్పుడూ ఎదుటి వారికి మంచి చేయాలనే ఆలోచిస్తాయన్న ప్రాచీన భారతీయ నమ్మకం నుంచి, ఇతరులను గౌరవించేలా.. వారి స్వేచ్ఛను పెంచేలా జీవించాలన్న మండేలా స్ఫూర్తికి అనుగుణంగా మనం అడుగులో అడుగు కలిపి, ఒకే గళంతో ముందుకు సాగాలని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం
ఇది కొత్త ప్రయాణంకాదు. కొత్తగా ప్రారంభించినది అంతకంటే కాదు. కానీ మన ప్రాచీన బంధానికి గొప్ప భవిష్యత్తు ఉందని నూతన వాగ్దానం చేస్తున్నాం. ఎంతో ఘనత, గౌరవం కలిగిన మీరంతా ఈ రోజు ఇక్కడకు రావడమే మన నిబద్ధతకు, సంకల్పానికిబలమైన నిదర్శనం.
ధన్యవాదాలు
Fabric of this world is richer because of the 54 sovereign flags of Africa: PM @narendramodi begins his speech https://t.co/Iy8hu3Nre5 #IAFS
— PMO India (@PMOIndia) October 29, 2015
We are deeply, deeply honoured by your presence today: PM @narendramodi to African leaders @indiafrica2015 #IAFS https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 29, 2015
It is not just a meeting of India & Africa. Today, the dreams of one-third of humanity have come together under one roof: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2015
The heart beat of 1.25 billion Indians & 1.25 billion Africans are in rhythm: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 29, 2015
2/3rd of India & Africa is under the age of 35. And, if the future belongs to the youth, then this century is ours to shape & build: PM
— PMO India (@PMOIndia) October 29, 2015
Africa’s economic growth has gathered momentum and has a more diversified base: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 29, 2015
African initiatives are replacing old fault lines with new bridges of regional economic integration: PM https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 29, 2015
Africa’s sports, art and music delight the entire world: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5 #IAFS @indiafrica2015
— PMO India (@PMOIndia) October 29, 2015
Africa and India are two bright spots of hope and opportunities in the global economy: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5 #IAFS
— PMO India (@PMOIndia) October 29, 2015
Technology will be a strong foundation of our partnership: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5 #IAFS @indiafrica2015
— PMO India (@PMOIndia) October 29, 2015
We will also collaborate to develop Indian and African treasures of traditional knowledge and medicines: PM @narendramodi @indiafrica2015
— PMO India (@PMOIndia) October 29, 2015
We will work to reduce digital divide within Africa and between Africa and rest of the world: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) October 29, 2015
We will also deepen India-Africa partnership on clean energy, sustainable habitats, public transport & climate resilient agriculture: PM
— PMO India (@PMOIndia) October 29, 2015
We wish to deepen our cooperation in maritime security and hydrography, and countering terrorism and extremism: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2015
We pledge to walk together, with our steps in rhythm and our voices in harmony: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2015
Today's proceedings at @indiafrica2015 got off to a great start. Dreams of 1/3rd of humanity gathered under 1 roof pic.twitter.com/Ojd6w0iTnl
— Narendra Modi (@narendramodi) October 29, 2015
We will walk together, our steps in rhythm & voices in harmony. We see a great future for this ancient relationship. https://t.co/2CDOWMQ6kz
— NarendraModi(@narendramodi) October 29, 2015