Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ ఉపరాష్ట్రపతి‌గా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి


భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. శ్రీ రాధాకృష్ణన్ పదవీ కాలం ఫలప్రదం కావాలనీప్రజలకు అంకితభావంతో ఆయన సేవ చేయాలని కోరుకుంటూ ఉపరాష్ట్రపతికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని రాస్తూఇలా పేర్కొన్నారు:
‘‘
శ్రీ సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యానుప్రజాసేవలో నిమగ్నమైన అధికారిగా ఆయన తన జీవనాన్ని దేశాభివృద్ధికీసమాజ సేవకూప్రజాస్వామ్య విలువల పరిరక్షణకూ అంకితం చేశారుఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం సఫలం కావాలనీప్రజలకు అంకితభావంతో  సేవ చేయాలనీ కోరుకుంటున్నాను. @VPIndia @CPRGuv”‌‌

 

**‌‌‌*