పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి భారత్, జపాన్ల మధ్య మలిదశ సాంకేతిక శిక్షణ కార్యక్రమం() కోసం పరస్పర అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
16-18 అక్టోబర్ 2017 మధ్యన టోక్యో సందర్శించనున్న గౌరవ శ్రీ నైపుణ్యాభివృద్ధి మరియు పరిశ్రమల వ్యవస్ధాపకత మంత్రి ఈ పరస్పర సహకార అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు.
ఈ మలిదశ సాంకేతిక శిక్షణ కార్యక్రమం(TITP) భారత సాంకేతిక ఉద్యోగులను శిక్షణార్థం మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలానికి జపాన్ కు పంపేందుకు ఉద్దేశించినది. నైపుణ్యాభివృద్ధి రంగంలో ఇరు దేశాలూ ద్వైపాక్షిక పరస్పర సహకారం అందించుకోవడానికి ఈ ఒప్పందం బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.