పిఎంఇండియా
భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వలసలు మరియు రాకపోకల భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఫ్రాన్స్ అధ్యక్షులు త్వరలో చేపట్టే భారత పర్యటన సమయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది.
ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాలను పెంపొందించడంలో, విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నైపుణ్యం కలిగిన వ్యక్తుల్లో చైతన్యాన్ని పెంపొందించడంలో,
రెండు దేశాల మధ్య అక్రమ వలసలు, మానవుల అక్రమ రవాణాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహకారాన్ని పటిష్టపరచుకోవడంలో – ఈ ఒప్పందాన్ని ఒక మైలు రాయిగా అభివర్ణించవచ్చు. ప్రాన్స్ తో బహుముఖంగా విస్తరిస్తున్న భారత్ సంబంధాలకు ఈ ఒప్పందం ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. అదేవిధంగా రెండు పక్షాల మధ్య వృద్ధిచెందుతున్న నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ ఇది సూచిస్తుంది.
ప్రాధమికంగా ఈ ఒప్పందం ఏడు సంవత్సరాలు అమలులో ఉంటుంది, అయితే, ఒక సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా దానంతట అదే కొనసాగించడానికీ, పర్యవేక్షణ యంత్రాOగాన్ని ఏర్పాటు చేసుకోడానికీ అవకాశం ఉంది.