పిఎంఇండియా
జోహో చీఫ్ సైంటిస్ట్ శ్రీ శ్రీధర్ వెంబు రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. డీప్-టెక్ సంబంధిత సామర్థ్యాలు భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే అందులో ప్రధానమంత్రి దార్శనికత, నిబద్ధతల పాత్ర చాలా ఉందని శ్రీ శ్రీధర్ వెంబు తన వ్యాసంలో వివరించారు.
సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలు ఎలా బలాన్ని పుంజుకొంటున్నాయో ఈ వ్యాసం చెప్పిందని శ్రీ మోదీ అన్నారు. అంతేకాకుండా, అనేక క్లిష్టతర విషయాలను సొంతగా నేర్చుకొనే మార్గాన్ని భారత్ ప్రస్తుతం ఎంచుకొంటోందని కూడా ఈ వ్యాసం పేర్కొందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘డీప్-టెక్ సంబంధిత సామర్థ్యాలు భారత్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే అందులో ప్రధానమంత్రి దార్శనికత, నిబద్ధతల పాత్ర చాలా వరకు ఉందని జోహో చీఫ్ సైంటిస్టు శ్రీ శ్రీధర్ వెంబు అంటున్నారు.
సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, కృత్రిమ మేధ రంగాలు శక్తియుక్తులను, పరిజ్ఞానాన్ని ఎంతలా పెంపొందింప చేసుకొంటున్నాయో శ్రీ శ్రీధర్ వెంబు వివరించారు. అనేక క్లిష్టతర విషయాల్లో సొంతంగానే పట్టు సాధించే మార్గాన్ని భారత్ ప్రస్తుతం ఎంచుకొంటోంది అని కూడా ఆయన అంటున్నారు’’ అని పేర్కొంది.
***
Chief Scientist of @zoho, Shri @svembu writes that India's rapidly evolving deep-tech capability owes much to PM @narendramodi's vision and commitment.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights how semiconductors, space, defence and AI are building capabilities and know-how, saying India is now choosing… pic.twitter.com/ODLAhbgTA1