Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత, అల్జీరియా మధ్య అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలు, వినియోగం రంగాలలో సహకారంపై కుదిరిన ఒప్పందాన్ని కేంద్రమంత్రి మండలి ఆమోదించింది.


భారత, అల్జీరియా మధ్య అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలు, వినియోగం రంగాలలో సహకారంపై ఒప్పందాన్ని ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రి మండలి ఆమోదించింది.  ఈ ఒప్పందంపై 2018 సెప్టెంబర్ 19వ తేదీన ఇరు దేశాలు బెంగళూరు లో సంతకాలు చేశాయి 

ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు :

అంతరిక్షం నుండి భూమి గురించి తెలుసుకోవడం, ఉపగ్రహం ద్వారా సమాచారం అందుకోవడం, ఉపగ్రహం కేంద్రంగా పరిసరాలను గుర్తించడం, అంతరిక్ష శాస్త్రం, ఉప గ్రహాల అన్వేషణ, అంతరిక్ష వాహనం, అంతరిక్ష విధానం, అంతరిక్ష సాంకేతికత వినియోగం తో సహా అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, వినియోగం వంటి అంశాలలో సహకరించుకోగల సామర్ధ్యాలను గుర్తించడానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. 
ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి అవసరమైన అంశాలు, నిర్ణీత కాల పరిమితి తో సహా ఒక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించడానికి గాను, డి ఓ ఎస్ / ఐ ఎస్ ఆర్ క్యూ సభ్యులు, అల్జీరియా అంతరిక్ష సంస్థ (ఏ ఎస్ ఏ ఎల్) సభ్యులతో ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. 

ప్రభావం : 

              ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా భారత, అల్జీరియా దేశాల మధ్య సహకారం పటిష్టమౌతుంది. భూమి కి సంబంధించిన విశేషాలను అంతరిక్షం నుండి తెలుసుకోడానికి, ఉప గ్రహాల అన్వేషణ అంతరిక్ష శాస్త్రం, బాహ్య అంతరిక్ష అన్వేషణకు కొత్త పరిశోధనా కార్యకలాపాలను విశ్లేషించడానికి ప్రేరణను అందిస్తాయి. మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష సాంకేతికతల వినియోగ రంగం లో సంయుక్త కార్యాచరణ అభివృద్ధికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.  తద్వారా  దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు ప్రయోజనం పొందుతాయి. 

నేపధ్యం :

అంతరిక్ష రంగంలో వాణిజ్య పరమైన పరస్పర చర్యలను భారత, అల్జీరియా దేశాలు కొనసాగిస్తున్నాయి.   గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు, ఉపగ్రహాల ప్రయోగం ( 2010 నుండి 2016 సంవత్సరాల మధ్య  అల్జీరియాకు చెందిన మూడు సూక్ష్మ ఉపగ్రహాలు, ఒక నానో ఉపగ్రహాలను  పి.ఎస్.ఎల్.వి. తో ప్రయోగించారు)  కోసం ఆంత్రిక్స్ కార్పొరేషన్ సంస్థ అల్జీరియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.   దౌత్య మార్గాల ద్వారా భారతదేశంతో అంతరిక్ష సహకారం పొందడానికి అల్జీరియా  ఆశక్తి వ్యక్తం చేసింది.  అంతరిక్ష సహకారం కోసం అంతర్ ప్రభుత్వ ఒప్పందం (ఐజిఏ) కుదుర్చుకోడానికి అల్జీరియా ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోడానికి వీలుగా ఎంవీఏ అల్జీరియా అందజేసిన నమూనా ఒప్పందాన్ని ఇస్రో /డి ఓఎస్ కు 2014 డిసెంబర్ లో ఎమ్ఈఏ కోరింది. 

 ఇస్రో, అల్జీరియా అంతరిక్ష ఏజెన్సీ (ఏఎస్ఏఎల్) సమీక్షించిన  ఐజిఏ నమూనా ను , వ్యాఖ్యలను ఈమెయిలు ద్వారా ఒకరి కొకరు పంపించుకోవడం జరిగింది. కొన్ని సంప్రదింపుల తర్వాత ఇరుపక్షాలు ఏజెన్సీ స్థాయి అంతరిక్ష సహకార ఒప్పందం అమలుచేయడానికి వీలుగా  ఒక  విధానాన్ని రూపొందించడం జరిగింది. 
 

******