Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ఆర్థిక బధ్రత హామీలు మరియు మార్పిడుల బోర్డు(SEBI), ఆర్థిక సేవల సంఘం (FSC) మరియు జిబ్రాల్టర్ ల మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి భారత ఆర్థిక బధ్రత హామీలు మరియు మార్పిడుల బోర్డు(SEBI), ఆర్థిక సేవల సంఘం (FSC) మరియు జిబ్రాల్టర్ ల మధ్య పరస్పర సహకారం మరియు అవగాహన ఒప్పందంపై సంతకం చేసి మండలి తన ఆమోదం తెలిపింది.

భవిష్యత్తులో ఇరు దేశాల్లోనూ ఆర్థికాభివృద్ధికి పరస్పర సహకారాన్ని మరియు ఆర్థిక మార్కెట్ ప్రభావశీల అభివృద్ధి వాతావరణాన్ని ఏర్పటును ప్రోత్సహించుకే ఈ అవగాహన ఒప్పందం. దీనిపై సంతకం చేసిన ఇరుదేశాల్లో పరస్పరం సమాచారాన్ని అందించుకునే వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సెబి, ఆర్థిక సేవల సంఘం మరియు జిబ్రాల్టర్లు పరస్పరం సహకరించుకుని విదేశాల్లోనూ తమ పరపతిని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.