పిఎంఇండియా
రాజకీయ సంప్రదింపులు
రియో డి జెనీరోలో 2024 నవంబర్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా సమావేశమైనప్పుడు ఆమోదించిన ‘భారత్-ఇటలీ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029′కు సంబంధించి వివిధ విభాగాల్లో సాధించిన స్పష్టమైన పురోగతిని ఇరువురు నేతలు అభినందించారు. ఈ భారత్-ఇటలీ ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 పురోగతిని సమీక్షించటంతో పాటు భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గదర్శకత్వాన్ని అందించడానికి విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించారు.
ఆర్థిక సహకారం, పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్స్, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి ఇరువురు ప్రధాన మంత్రులు అంగీకరించారు. సరఫరా వ్యవస్థల విషయంలో మరింత నిర్దిష్ట అంశాల ఆధారిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించారు. అంతరిక్ష యాక్సెస్, అంతరిక్ష మౌలిక సదుపాయాల రక్షణపై సహకార అవకాశాలను అన్వేషించడానికి వారు అంగీకరించారు. ఇరు దేశాల అంతరిక్ష పరిశ్రమల ప్రతినిధి బృందాల ఇటీవలి పరస్పర పర్యటనల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణుల మార్పిడి, ఉమ్మడి కార్యక్రమాల ద్వారా వాణిజ్యపరమైన సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, తృతీయ పక్ష దేశాలలోనూ ఈ
జాయింట్ డిఫెన్స్ కమిటీ, మిలిటరీ సహకార బృందం కార్యకలాపాలకు తోడ్పాటునిస్తూ, సంవత్సరానికోసారి సైన్యానికి సంబంధించి ఉన్నత స్థాయి నిర్మాణాత్మక చర్చలను నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి… సంయుక్త సైనిక విన్యాసాలను, ఇరు దేశాల ఉమ్మడి సైనిక చర్యలను సులభతరం చేసేందుకు వీలుగా శిక్షణ, విద్యా సంబంధిత పాఠ్యప్రణాళికను రూపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
నౌకా వాణిజ్య రంగంలో భద్రతాపరమైన సహకారం, సమన్వయం, సమాచారం, అత్యుత్తమ విధానాలను పంచుకోవడాన్ని పెంపొందించే లక్ష్యంతో… నౌకా వాణిజ్య భద్రతపై చర్చలను ప్రారంభించడానికి ఇరు దేశాల నేతలూ అంగీకరించారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఇటలీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన శాశ్వత కార్యాచరణ బృందం తొలి సమావేశాన్నీ… ఉగ్రవాదాన్ని నిరోధించడం లక్ష్యంగా పనిచేసే సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు.
ఇటాలియన్ గార్డియా డి ఫినాంజా, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. క్లాసిఫైడ్ సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర రక్షణ కల్పించడానికి సంబంధించిన ఒప్పందం… పోలీసు సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందం త్వరలోనే పూర్తవుతాయని వారు ఆకాంక్షించారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం, పరస్పర న్యాయ సహాయ ఒప్పందం సహా ఇతర ఒప్పందాలపై కొనసాగుతున్న చర్చలనూ వారు స్వాగతించారు.
వలసలు, రాకపోకలు
ఇటాలియన్ విశ్వవిద్యాలయాల్లో చేరిన భారతీయ విద్యార్థులకు మార్గనిర్దేశం, మ్యాచింగ్, ఇటాలియన్ చట్టాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసం నిర్దిష్ట మార్గాలను అందించడం ద్వారా వారి ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో “ఐసీఐ – ఇటలీ కాల్స్ ఇండియా: ఎ యూనివర్సిటీ-ఎంటర్‌ప్రైజ్ టాలెంట్ బ్రిడ్జ్”ను ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు.
సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలను నిర్ధారించడానికి… అక్రమ వలసలు, శ్రమ దోపిడీ, మానవ అక్రమ రవాణాల వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలనూ వారు చర్చించారు.
సంస్కృతి, విద్యాసంబంధ సహకారం
సంస్థలు, నిపుణులు, సృజనాధారిత పరిశ్రమల ప్రతినిధులను ఒకచోట చేర్చే ఇటలీ-భారత్ సాంస్కృతిక వేదికను నిర్వహించాలని ఇరువురు నేతలు ప్రోత్సహించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి, నిర్వహణలో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో… యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందిన భారతీయ, ఇటాలియన్ ప్రదేశాల మధ్య జంట నగరాల కార్యక్రమాన్ని ప్రారంభించడాన్నీ ఇరువురు నేతలు అభినందించారు.
ఇరు దేశాల పరిశ్రమల బలం, నూతన ఆవిష్కరణల సామర్థ్యాలు, ద్వైపాక్షిక సహ-నిర్మాణ ఒప్పందం ద్వారా అందించిన చట్టపరమైన విధాన ప్రణాళిక ఆధారంగా… చలనచిత్ర, ఆడియో-విజువల్ సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
ఉన్నత విద్యారంగంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే తమ ఉద్దేశాన్ని ఇరువురు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఉన్నత విద్య, పరిశోధనలపై ఇండో-ఇటాలియన్ రోడ్‌మ్యాప్‌ను ఆమోదించడాన్ని స్వాగతించారు. భారత నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత్‌లో క్యాంపస్‌లను ప్రారంభించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానించారు.
భారత్-ఈయూ సంబంధాలు
2026 జనవరి 27న జరిగిన భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన భారత్-ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఉమ్మడి ఎజెండాను, భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఫలవంతమైన చర్చలను ఇరువురు నేతలు స్వాగతించారు. మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తేవడం, వాణిజ్య అవరోధాలను తగ్గించడం, వైవిధ్యభరితమైన వ్యాపార సంస్థలు, కొత్త మార్కెట్ అవకాశాల ద్వారా ఆర్థిక భద్రతను, సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని వారు అభిప్రాయపడ్డారు.
వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఆర్థిక భద్రత రంగాల్లో సహకారానికి ముఖ్య వేదికగా భారత్-ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి బలోపేతానికి తమ మద్దతును వారు పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. సమగ్ర రవాణా విధాన ప్రణాళిక గురించిన అవగాహన ఒప్పందం సహా… రవాణా రంగ సహకారంలో సాధించిన పురోగతిని వారు ప్రశంసించారు.
బహుపాక్షికవాదాన్ని పరిరక్షించడానికి, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను కొనసాగించడం కోసం ఐక్యరాజ్యసమితి, జీ20 సహా ఇతర ప్రపంచ వేదికల్లో కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
ఆఫ్రికాకు ఇరు దేశాలు ఇస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన నేతలు… ఆఫ్రికా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం, ఇటలీ మాటీ ప్రణాళికకు అనుగుణంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనాల వంటి రంగాల్లో ఆఫ్రికన్ భాగస్వాములతో కలిసి త్రైపాక్షిక కార్యక్రమాల్లో పనిచేయడానికీ వారు అంగీకరించారు.
యూఎన్‌సీఎల్ఓఎస్ సహా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత, అందుబాటులో గల, శాంతియుత, సుసంపన్న ఇండో-పసిఫిక్ సాధన పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమాల సంబంధిత శాస్త్ర-సాంకేతిక, విద్యాసంబంధిత సహకార విభాగాల్లో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలోని పరిస్థితిపైనా… ఆ ప్రాంతంతో పాటు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలపై దాని ప్రభావాలపైనా ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 8 ఏప్రిల్ 2026న ప్రకటించిన కాల్పుల విరమణను వారు స్వాగతించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి కోసం ఉద్రిక్తతలను తగ్గించడం… చర్చలు, దౌత్యం ప్రాముఖ్యతనూ వారు స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని, ప్రపంచ దేశాలకు సరుకు రవాణాను పునఃప్రారంభించాలనీ ఇరువురు ప్రధానమంత్రులు పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వల్ల అపారమైన నష్టాలు, ఇబ్బందులు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా… చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు కొనసాగించడానికి వారు అంగీకరించారు.
ఇటలీ ప్రభుత్వం, ప్రజలు అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి గానూ ఆ దేశ ప్రధానమంత్రి మెలోనికి ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుపక్షాలకు అనుకూలమైన సమయంలో భారత్‌ను సందర్శించాల్సిందిగా ఇటలీ ప్రధానమంత్రిని… శ్రీ మోదీ ఆహ్వానించారు.
***
Una partnership strategica speciale che non solo andrà a beneficio delle nostre nazioni ma anche dell’intera umanità!
— Narendra Modi (@narendramodi) May 20, 2026
I risultati della mia visita in Italia garantiranno maggiori collegamenti per gli investimenti, migliori opportunità commerciali, legami culturali più stretti e… https://t.co/lDV5F0xN1Y
Una partnership strategica speciale che non solo andrà a beneficio delle nostre nazioni ma anche dell’intera umanità!
— Narendra Modi (@narendramodi) May 20, 2026
I risultati della mia visita in Italia garantiranno maggiori collegamenti per gli investimenti, migliori opportunità commerciali, legami culturali più stretti e… https://t.co/lDV5F0xN1Y