పిఎంఇండియా
భారత, కెనడా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎమ్ ఓ యు) గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలికి వివరించడం జరిగింది. ఈ ఎమ్ ఓ యు పై 2018 ఫిబ్రవరి 21వ తేదీన సంతకాలు చేయడం జరిగింది.
భారత, కెనడా దేశాల మధ్య పరిశోధన, సరిహద్దు భాగస్వామ్యాన్ని పెంపొందించడం మరియు పారిశ్రామిక విద్య సహకారం కోసం ఈ అవగాహనా ఒప్పందాన్ని ఉద్దేశించారు. ఈ ఒప్పందం ఇరు దేశాలకు ఆవిష్కరణ లాభాలను కలుగజేయనుంది.
ప్రతిభను చైతన్య పరచడం ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఆశయం. భారత్, కెనడా దేశాల పరిశోధకులు గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యా పరిశోధనా చైతన్యాన్నీ, సరిహద్దు పారిశ్రామిక విద్యా సహకారాన్నీ పెంపొందించుకోడానికి ఈ ఎం ఓ యు అవకాశం కల్పిస్తుంది. గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యా పరిశోధనా చైతన్యం కార్యక్రమం క్రింద ఇరు పక్షాలూ 110 మంది దాకా మాస్టర్స్ డిగ్రీ మరియు పి హెచ్ డీ చదివే భారతీయ విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, మాథెమాటిక్స్ (ఎస్ టి ఈ ఎం) రంగాలలో మూడేళ్లపాటు భారతదేశంలోని అర్హత కలిగిన విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడానికీ, 12 నుండి 24 వారాల పాటు కెనడాకు చెందిన విశ్వవిద్యాలయ ప్రయోగశాలల్లో పరిశోధనకూ సహకారాన్ని అందిస్తాయి. అదేవిధంగా కెనడాలోని విశ్వవిద్యాలయాలకు చెందిన 110 మంది దాకా విద్యార్థులు కూడా 12 నుండీ 24 వారాల పాటు అర్హత కలిగిన భారతీయ విశ్వవిద్యాలయ ప్రయోగశాలల్లో 12 నుండి 24 వారాల పాటు పాల్గొంటారు. సరిహద్దు పారిశ్రామిక విద్యా కార్యక్రమము కింద, ఒక్కొక్క దేశం నుండి 40 మంది దాకా మాస్టర్స్ మరియు పి హెచ్ డి విద్యార్థి పరిశోధకులు 16 నుండి 24 వారాలపాటు మరొక దేశంలోని పారిశ్రామిక భాగస్వాములతో కలిసి పాల్గొంటారు.
నూతన పరిజ్ఞానాన్ని సంపాదించుకోడానికీ, సంయుక్తంగా సాంకేతిక ప్రచురణలు, పారిశ్రామిక అవగాహన, ఐపీ తయారు చేయదానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కెనడాతో ఎంతో కాలంగా కొనసాగుతున్న శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను ఈ ఎంఓయు మరింత పటిష్ఠపరుస్తుంది.