Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత దేశం, బంగ్లాదేశ్ ల మధ్య రెండో క్రాస్ బార్డర్ ట్రాన్స్ మిషన్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ ను సంయుక్తంగా అంకితం చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

భారత దేశం, బంగ్లాదేశ్ ల మధ్య రెండో క్రాస్ బార్డర్ ట్రాన్స్ మిషన్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ ను  సంయుక్తంగా అంకితం చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా


భారత దేశం, బంగ్లాదేశ్ ల మధ్య రెండో క్రాస్ బార్డర్ ట్రాన్స్ మిషన్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా లు ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అంకితం చేశారు. ఇది త్రిపుర లోని సూర్యమణి నగర్ ను బంగ్లాదేశ్ లోని దక్షిణ కమిలా తో కలుపుతుంది.

అగర్తలా కు బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ కు మధ్య 10 జి బి పి ఎస్ ఇంటర్ నెట్ అనుసంధాన సదుపాయానికి సంబంధించిన ప్రసారాలను కూడా ఈ ఇరువురు నేతలు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారత – బంగ్లాదేశ్ సంబంధాలలో ఇది ఒక చరిత్రాత్మక తరుణం అని పేర్కొన్నారు. భారత దేశంతో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ నెరిపిన సన్నిహిత సంబంధాన్ని గురించి ఆయన గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సహకారానికి పలు దారులు తెరుచుకొన్నాయని పేర్కొన్నారు. బంగబంధు ఆలోచనలను, దార్శనికతను ముందుకు తీసుకు వెళ్తున్నందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ను ప్రశంసించారు.

భారత దేశ తూర్పు ప్రాంతంలో ఒక సరికొత్త ఇంటర్ నెట్ ప్రవేశ ద్వారం తెరుచుకుంటున్న పరిణామం అపారమైన ప్రాముఖ్యం కలిగిన పరిణామమని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ లకు ఉత్తేజాన్ని ఇవ్వడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో మేలు చేయగలదని ఆయన చెప్పారు. ఈ మధ్య ఉభయ దేశాల నడుమ రహదారుల అనుసంధానం, డిజిటల్ అనుసంధానం సహా మరిన్ని విధాలుగా ఇతోధిక అనుసంధానం చోటు చేసుకున్నట్లు ఆయన వివరించారు.

బంగబంధు ఉపగ్రహ ప్రయోగానికి బంగ్లాదేశ్ కు అన్ని విధాలా అండదండలు అందిస్తామని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ రోజు జరుగనున్న టి-20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల క్రికెట్ జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

***