పిఎంఇండియా
భారత నీటి నిర్వహణ నమూనా విస్తృత గ్లోబల్ సౌత్ దేశాలకు ఏ విధంగా ఉపయోగకరమైన పాఠాలను అందిస్తోందనే అంశం గురించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. జల భద్రత అంటే కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదనీ… మంచి ప్రణాళిక, పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడం ఇందులో భాగమేమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
“గుజరాత్లో నీటి సంస్కరణల నుంచి భారీ–స్థాయి జాతీయ కార్యక్రమాల దాకా భారత్ సాగించిన ప్రయాణం… నీటి నిర్వహణను మెరుగుపరచుకోవడానికి, పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్న దేశాల కోసం ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలుస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
భారత్లోని నీటి నిర్వహణ నమూనా విస్తృత గ్లోబల్ సౌత్ దేశాలకు ఉపయోగకరమైన పాఠాలను అందిస్తోంది. జల భద్రత అంటే కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదు… మంచి ప్రణాళిక, పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడం ఇందులో భాగమే.
గుజరాత్లో నీటి సంస్కరణల నుంచి భారీ–స్థాయి జాతీయ కార్యక్రమాల దాకా భారత్ సాగించిన ప్రయాణం… నీటి నిర్వహణను మెరుగుపరచుకోవడానికి, పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలకు ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలుస్తుంది.
***
From India, a water-governance model is offering useful lessons for the wider Global South. Water security is not only about building infrastructure but also about good planning, strong local systems and involving communities in managing water. India's journey from water reforms in Gujarat to large-scale national programmes offers a practical example for countries looking to improve water management and meet growing water needs. https://t.co/9ZztUeZoAH
— PMO India (@PMOIndia) October 6, 2026