పిఎంఇండియా
బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఈ సమావేశం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాలకు మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తున్న భారత్ – బ్రిటన్ భాగస్వామ్యం ఇటీవలి కాలంలో బలోపేతమవడాన్ని ఆయన అభినందించారు.
భారత్ – యూకే విజన్ 2035 నిరంతర మార్గనిర్దేశంలో ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతుందని, ప్రపంచ శ్రేయస్సు దిశగా ఉమ్మడి కృషిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇటీవలి కాలంలో భారత్ – బ్రిటన్ భాగస్వామ్యం బలోపేతమవడం అభినందనీయం. మన రెండు దేశాలకూ మునుపెన్నడూ లేనంత విస్తృతంగా అభివృద్ధి అవకాశాలను ఈ భాగస్వామ్యం అందిస్తోంది.
భారత్ – యూకే విజన్ 2035 మార్గనిర్దేశంలో మన భాగస్వామ్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రపంచ శ్రేయస్సు దిశగా మన ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది’’.
***
Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.
— Narendra Modi (@narendramodi) June 4, 2026
India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our… pic.twitter.com/OvrzspeLbP