Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్ – జ‌ర్మ‌నీ ల మ‌ధ్య ఉన్న‌త విద్య అవ‌గాహ‌న ఒప్పంద‌ంలో స్వ‌ల్ప స‌వ‌ర‌ణ‌ల కోసం ఉమ్మ‌డి ఉద్దేశ ప్ర‌క‌ట‌న


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం, భార‌త్ – జ‌ర్మ‌నీ దేశాల మ‌ధ్య ఇదివ‌ర‌కే జ‌రిగిన ఉన్న‌త విద్య అవ‌గాహ‌న ఒప్పంద‌లో స్వ‌ల్ప స‌వ‌ర‌ణ‌ల కోసం ఉమ్మ‌డి ఉద్దేశ ప్ర‌క‌ట‌నను ఆమోదించింది. ఈ ఉమ్మ‌డి ఉద్దేశ ప్ర‌క‌ట‌న‌పై సంత‌కం చేయ‌డం ద్వారా ఈ కార్య‌క్ర‌మంలో ‘వ్యూహాత్మ‌క’ అనే ప‌దాన్ని తొల‌గించి ‘ఉన్న‌త విద్య‌లో భార‌త్ – జ‌ర్మ‌నీ భాగ‌స్వామ్యం’గా మార్చారు. అలాగే, కార్య‌క్ర‌మం కోసం నిధులను స‌మ‌కూర్చే కాలాన్ని 2015-19 నుండి 2016-20 (జులై 1, 2016 నుండి జూన్ 20, 2020) కు మార్చారు.

ఈ ఉమ్మ‌డి ఉద్దేశ ప్ర‌క‌ట‌న వ‌ల్ల ఇరు దేశాల ఉన్న‌త విద్యారంగం బ‌లోపేతం కావ‌డంతోపాటు, విద్య‌, ప‌రిశోధ‌న‌, నైపుణ్యాల పెంపు వంటి రంగాల్లో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్యం ఇరు దేశాల మ‌ధ్య సాధ్య‌మ‌వుతుంది. అలాగే, బోధ‌నా సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటూ, భార‌త్ కు స‌మ‌స్యాత్మ‌క అంశాల‌లో జ‌రిగే ప‌రిశోధ‌నల‌లో వేగం పెర‌గ‌నుంది.